Vizag: గ్యాస్ లీకేజీపై స్పందించిన కంపెనీ
విశాఖపట్నంలో నేటి తెల్లవారు జామున ప్రమాదకర స్టైరిన్ విషవాయువు లీకైన ఘటనలో 8 మంది చనిపోవడం తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన ఎల్.జీ పాలిమర్ సంస్థ గ్యాస్ లీకేజీపై స్పందించింది.
విశాఖపట్నంలో నేటి తెల్లవారు జామున ప్రమాదకర స్టైరిన్ విషవాయువు లీకైన ఘటనలో 8 మంది చనిపోవడం తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన ఎల్.జీ పాలిమర్ సంస్థకు చెందిన మేనేజర్ మోహన్ రావు గ్యాస్ లీకేజీపై స్పందించారు. దాదాపు ఐదున్నర దశాబ్దాలుగా స్టైరిన్ మోనోమర్‌తో ఇక్కడ వ్యాపారం చేస్తున్నామని, గతంలో ఇలాంటి ఘటన జరగలేదన్నారు. స్టైరిన్ మోనోమర్ ఎప్పుడూ కదలికలో ఉండాలన్నారు. బికినీలో అమెరికన్ అందం హాట్ పోజులు
రిఫ్రిజరేషన్‌తో పాటు కంపెనీ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి తమకు అనుమతి ఉందని తెలిపారు. రిఫ్రిజరేటివ్ సిస్టమ్స్ మేనేజ్ చేయడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరని చెప్పారు. 5 వేల టన్నుల కెపాసిటీతో రెండు స్టైరిన్ మోనోమర్ నిల్వ చేసే ట్యాంకులు ఉన్నాయని, ఎల్.జీ పాలీమర్‌లో ప్రతి షిష్ట్‌లో 15 మంది సిబ్బంది పనిచేస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం 20 డిగ్రీల టెంపరేచర్ వద్ద స్టోరేజ్ ట్యాంకులో స్టైరిన్ నిల్వ చేశారు. Vizag Gas Leak: విశాఖ ఘటన హృదయ విదారకరం: చిరంజీవి, మహేష్ బాబు
గత 45 రోజులుగా పనులు జరగక పోవడంతో ఉన్నట్టుండి ట్యాంక్ పై తలానికి పాలిమర్ పట్టేసి తిరిగి ట్యాంకులో పడిందన్నారు. ఇలా పడటం వల్ల ఆటో పాలిమినైజైషన్ జరిగి వెంటనే గ్యాస్ లీక్ అయిందని వివరించారు. తొలిసారి పెద్ద సమస్య తలెత్తిందని, నిమిషాల్లో ఇలా జరిగిందని ప్రాణాంతక వాయువు విడుదలైన ఎల్.జి పాలిమర్ కంపెనీ మేనేజర్ మోహనరావు చెప్పుకొచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!