Vontimitta Temple Srirama Kalyanam 2023: ఒంటిమిట్టలో అంగరంగ వైభవంగా శ్రీరాముడి కల్యాణం
Vontimitta Temple Srirama Kalyanam 2023: మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవరలను చదివారు. రాములవారి వంశస్వరూపాన్ని స్తుతించారు. అగ్నిప్రతిష్టాపన తరువాత సీతా రాముల తల మీద జీలకర్ర, బెల్లం ఉంచి శాస్త్రోకంగా కల్యాణ వేడుక నిర్వహించారు. తరువాత మంగళాష్టకం, చూర్ణిక పఠించి, మాంగళ్యసూత్ర పూజ, మంగళసూత్రధారణ, అక్షతారోపణం చేపట్టారు.
Vontimitta Temple Srirama Kalyanam 2023: ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి కల్యాణోత్సవాన్ని తన్మయత్వంతో తిలకించారు. రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను శాస్త్రరీత్యా తెలిపే కాంతకోరిక కార్యక్రమాన్ని రాత్రి 7 గంటలకు వేదిక మీద అర్చకులు నిర్వహించారు. రాత్రి 7.30 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. 8 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా భగవత్ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, లోకకల్యాణం కోసం సంకల్పం చేయించారు. కల్యాణంలోని పదార్థాలన్నీ భగవంతుని మయం చేసేందుకు పుణ్యాహవచనం నిర్వహించారు. ఆ తరువాత రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, వరప్రేశనం(కన్యావరణం), మధుపర్కార్చనం చేశారు.
మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవరలను చదివారు. రాములవారి వంశస్వరూపాన్ని స్తుతించారు. అగ్నిప్రతిష్టాపన తరువాత సీతా రాముల తల మీద జీలకర్ర, బెల్లం ఉంచి శాస్త్రోకంగా కల్యాణ వేడుక నిర్వహించారు. తరువాత మంగళాష్టకం, చూర్ణిక పఠించి, మాంగళ్యసూత్ర పూజ, మంగళసూత్రధారణ, అక్షతారోపణం చేపట్టారు. స్వామి నివేదన, వేదస్వస్తి, మహదాశీర్వచనంతో కల్యాణఘట్టం పూర్తయింది. శ్రీ కోదండరామయ్య కల్యాణం సందర్బంగా తిరుమల నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి బుధవారం కానుకలు పంపారు.
సీతారాముల కల్యాణం సందర్భంగా రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున బుధవారం ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని సాయంత్రం శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర ఆలయం నుండి కల్యాణవేదిక వరకు వైభవంగా జరిగింది. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్ర వేడుకగా సాగింది. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో శ్రీ సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.
కల్యాణ వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో కూర్చుని శ్రీ సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు విచ్చేసిన భక్తులందరికి శ్రీవారి సేవకులు ముత్యంతో కూడిన తలంబ్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి దంపతులు, మంత్రులు కొట్టు సత్యనారాయణ, రోజా, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు, ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమరనాథ రెడ్డి, శాసన సభ్యులు మేడా మల్లిఖార్జున రెడ్డి, జి. శ్రీకాంత్ రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ అన్బు రాజన్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : Jagananne Maa Bhavishyathu: 7 లక్షల మందితో ప్రతి ఇంటికీ 'జగనన్నే మా భవిష్యత్తు'.. ఈ నెల 7న శ్రీకారం
ఇది కూడా చదవండి : CM Jagan: సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్.. నెలల వారీగా ప్రభుత్వ కార్యక్రమాలు ఇవే..
ఇది కూడా చదవండి : Pawan Kalyan: కేంద్రమంత్రితో పవన్ కళ్యాణ్ భేటీ.. వైసీపీపై ఫిర్యాదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook