AP Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రాగల మూడురోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, పరిసిర ప్రాంతాల్లో  (Bay of Bengal) ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి సగటున 1.5 కిలోమీటర్లు ఎత్తు వరకు వ్యాపించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ అధికారులు తెలిపారు. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశముంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నైరుతి ఉపరితల ఆవర్తనం కారణంగా ఉత్తర కోస్తాంధ్రలో ఈ మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (AP Rains) కురిసే అవకాశం ఉంది.ఈ  రోజు, రేపు, ఎల్లుండి ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  అక్కడక్కడ మెరుపులు లేదా ఉరుములు ఏర్పడే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook