Tirupati Laddu Prasadam: తిరుపతి లడ్డూ ఈజీగా తయారు చేసే విధానం.. 14 మిలియన్లు క్రాస్‌ చేసిన రిసిపీ వీడియో మీకోసం..‌

Tirupati Laddu Prasadam Recipe Video: తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ చెఫ్‌ షేర్‌ చేసిన లడ్డూ వీడియో రిసిపీతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పటికే 14 మిలియన్ల వ్యూస్‌ దాటిన ఆ రిసిపీ వీడియో మీకోసం..

Written by - Renuka Godugu | Last Updated : Sep 24, 2024, 08:25 PM IST
Tirupati Laddu Prasadam: తిరుపతి లడ్డూ ఈజీగా తయారు చేసే విధానం.. 14 మిలియన్లు క్రాస్‌ చేసిన రిసిపీ వీడియో మీకోసం..‌

 Tirupati Laddu Prasadam Recipe Video:  దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్న తిరుపతి లడ్డూ ప్రసాదం. ముఖ్యంగా ఇందులో బీఫ్ ఫ్యాట్‌, చేప నూనె కలిసిందని తెలుస్తోంది. లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో వీటి ఆనవాళ్లు కనిపించాయని ల్యాబ్‌ టెస్ట్‌లో కూడా తేలింది. అయితే, ఈ రుచికరమైన తిరుపతి లడ్డూ ప్రసాదం రిసిపీని ఇంట్లోనే మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ రిసిపీకి సంబంధించిన వీడియో చెఫ్‌ ప్రవీణ్‌ కుమార్ షేర్‌ చేశారు. ఇటీవలె ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేశారు. ఈ నేపథ్యంలో నెట్టింటా వైరల్‌గా మారిన ఈ వీడియో ఏకంగా 14 మిలియన్ల వ్యూస్‌ దాటేసింది. ఇకపై మీరు కూడా ఈ వీడియోను చూసి సులభంగా తిరుపతి స్టైల్‌లో లడ్డూలను మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

ఈ ప్రఖ్యాత తిరుపతి లడ్డూ ప్రసాదం మన ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుమల దేవాలయంలో తయారు చేస్తారు. ప్రస్తుతం ఈ లడ్టూ కల్తీ గురించి దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు భిన్నాభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. అయితే,  ఈ వీడియో చూసి కూడా మీరు సింపుల్‌గా తిరుపతి లడ్డూ ప్రసాదం అందించే అద్భుతమైన రుచికరమైన లడ్డూను మీ స్వహస్తాలతో కూడా తయారు చేయవచ్చు. ఈ వీడియోలో చెఫ్‌ తమిళ్‌లో లడ్డూ రిసిపీని చెప్పారు.. కానీ, తాను తయారు చేసే విధానం చూస్తే ఎవ్వరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: తెలంగాణ సెట్‌ 2024 ప్రిలిమినరీ కీ విడుదల.. త్వరలో ఫలితాలు వెల్లడి..  

14 మిలియన్లు దాటిన ఈ వీడియోలో లడ్డూ తయారీ విధానాన్ని చెఫ్‌ ఎంతో సులభంగా తయారు చేసి చూపించారు . ముఖ్యంగా ఈ లడ్డూ ప్రసాదాన్ని కేవలం స్వచ్ఛమైన ఆవునెయ్యితో తయారు చేశారు. ముందుగా నెయ్యి ఒక ప్యాన్‌ లో వేసి కరిగించాడు చూస్తూనే కొన్ని సెకన్లలోనే ఇతర పదార్థాలను కూడా కలిపి సులభంగా తయారు చేశాడు. చక్కెర, బియ్యం పిండి, పాలు, శనగపిండి, నెయ్యి ఈ పదార్థాలతో ముందుగా బూందీ తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత పాణకం తయారీకి నీళ్లు, చక్కెర ఉపయోగించాడు.

 

 

 
 
 
 
 

 

ఇదీ చదవండి: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్‌ సర్కార్‌ మహిళలకు పండుగ కానుక..!  

ముందుగా బూందీ తయారు చేసుకున్న తర్వాత పాకం తయారు చేసి అందులో ఓ పది నిమిషాల పాటు నానబెట్టాడు. అందులోనే మిస్త్రీ, పచ్చకర్పూరం, డ్రైఫ్రూట్స్‌ కూడా వేశాడు, క్రష్‌ చేసిన యాలకులు కూడా వేసి లడ్డూలు కట్టాడు. అంతే ఎంతో రుచికరమైన తిరుపతి స్టైల్‌లో లడ్డూ తయారీ చేసుకోవచ్చు. ఈ వీడియో షేర్‌ చేసిన వెంటనే నెట్టింటా వైరల్‌గా మారింది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం బర్నింగ్‌ ఇష్యూ కాబట్టి ఎక్కువ మంది వీక్షించారు. గత వైసీపీ ప్రభుత్వం బీఫ్‌ ఫ్యాట్‌, చేపనూనె ఉన్న నెయ్యిని కొనుగోళు చేశారని ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీన్ని ల్యాబ్‌ టెస్ట్‌కు పంపించారు. రిపోర్టులో కూడా అదే తేలింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

  

Trending News