Heat Wave Effect on both Telugu States: తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా తయారయ్యాయి. ఉదయం పది గంటలు దాటితే రోడ్లపై జనాలు తిరగటం లేదు. సూర్యుడి ప్రతాపానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భానుడి భగభగలకు కొందరు మృత్యువాత కూడా పడుతున్నారు. మరో రెండు రోజులపాటు వడగాలుల తీవ్రత ఇలానే కొనసాగే అవకాశం ఉందని..ఆ తర్వాత వేడి పరిస్థితులు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఏపీ విషయానికొస్తే.. ఎండలు మండిపోతున్నాయి. చాలా జిల్లాలో 44 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 478 మండలాల్లో వడగాలులు వీస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు పైనే నమోదవుతున్నాయి. పార్వతీపురం మన్యం 44.87 డిగ్రీలు, విజయనగరం 44, అనకాపల్లి 43.9, అల్లూరి 42.7, విశాఖపట్నం 41.3 డిగ్రీలు రికార్డుయింది. మిగిలిన ప్రాంతాల విషయానికొస్తే..తూర్పుగోదావరి 42.5, ఏలూరు 42.2, ఎన్టీఆర్ 41.9, గుంటూరు 41, బాపట్ల 41, పల్నాడు 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాని అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. మరో రెండు రోజులపాటు కోస్తాంధ్రలో హీట్ వేవ్ కొనసాగితే.. రాయలసీమ జిల్లాల్లో వేడి తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.


Read More: 7th Pay Commission updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై నుంచి మరో 4 శాతం పెరగనున్న డీఏ


రాయలసీమలో వర్షాలు..


జూన్ 19 నుంచి 21వ తేదీ వరకు రాయలసీమలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం నైరుతీ రుతుపవనాలు ఏపీలోని శ్రీహరికోట, పుట్టపర్తి, కర్ణాటకలోని రత్నగరి, కొప్పాల్ వరకూ విస్తరించాయని పేర్కొంది. ఈనెల 18 నుంచి నైరుతి పవనాలు ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది.


అక్కడ కూడా తీవ్ర వడగాలులే..


మరోవైపు తెలంగాణ విషయానికి కొస్తే.. వేడిగాలులతో ప్రజలు అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.  అదే విధంగా భూపాలపల్లి, మహబూబాబాద్, కుమురం భీం, నిర్మల్, వరంగల్‌, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు కూడా పేర్కొంది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.


Also Read: Biperjoy Effect: బిపర్‌జోయ్ విధ్వంసం, గుజరాత్‌లో భారీ వర్షాలు, భీకరమైన గాలులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook