కేంద్ర బడ్జెట్ 2018ని ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశబెట్టాక..అందులో తెలుగు రాష్ట్రాలకు ప్రభుత్వం చేసిన కేటాయింపులు ఏమిటో  మనమూ ఒకసారి తెలుసుకుందాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన కేటాయింపులు 


*ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీకి రూ.32 కోట్లు కేటాయించారు.


*కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు కేటాయించారు.


*గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు కేటాయించారు 


*విశాఖ పోర్టుకు రూ.108 కోట్లు కేటాయించారు


*ఎన్‌ఐటీ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి)కి రూ.54 కోట్లు కేటాయించారు.


*ఐఐటీకి రూ.50 కోట్లు కేటాయించారు.


*ట్రిపుల్‌ ఐటీకి రూ.30 కోట్లు కేటాయించారు.


*ఐఐఎంకు రూ.42 కోట్లు కేటాయించారు.


*ఐఐఎస్‌సీఆర్‌కు రూ.49 కోట్లు కేటాయించారు.


*డ్రెడ్జింగ్‌ కార్పోరేషన్‌కు రూ.19.62 కోట్లు కేటాయించారు.


తెలంగాణకు కేటాయింపులు ఇలా..


*హైదరాబాద్‌ ఐఐటీకి రూ.75 కోట్లు కేటాయించారు.


*గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు కేటాయించారు.


*తెలంగాణలో సింగరేణికి రూ 2 వేల కోట్ల పెట్టుబడులు సమకూర్చనున్నట్టు తెలిపారు