YS Sharmila Liquor Comments: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ సీఎం చంద్రబాబును కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా ఇంకా ఆర్టీసీ ఉచిత బస్సు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. వెంటనే ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా షర్మిల ఆర్టీసీ బస్సులో ప్రయాణించి హల్‌చల్‌ చేశారు. బస్సులో టికెట్‌ తీసుకుని మహిళలతో మాట్లాడారు. ఉచిత బస్సు వెంటనే అమలు చేయాలని కోరుతూ బస్సులోనే నిరసనకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Liquor Shop: నివాసాల మధ్య మద్యం దుకాణం ప్రారంభం.. దాడి చేసిన మహిళలు


విజయవాడలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి తెనాలికి శుక్రవారం ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో వైఎస్ షర్మిలా రెడ్డి ప్రయాణించారు. స్వయంగా టికెట్‌ కొని బస్సులో కూర్చున్నారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీ 'ఉచిత ఆర్టీసీ బస్సు పథకం' ప్రారంభించాలని షర్మిల నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో షర్మిల మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: AP Cabinet: ప్రపంచపటంలో ఏపీని నిలబెట్టడమే లక్ష్యం.. సీఎం చంద్రబాబు 'ఆరు విధానాలు' ఆరు అస్త్రాలు


'చంద్రబాబు అధికారంలో వచ్చి నాలుగు నెలలు అయింది. అయినా ఉచిత బస్సు ప్రయాణంపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉచిత ప్రయాణం ఎప్పుడు అని అడుగుతున్నారు. తెలంగాణలో వారంలో అమలు చేశారు. మీరు వచ్చి పది నెలలైనా ఎందుకు అమలు చేయడం లేదు' అని షర్మిల ప్రశ్నించారు. ఆర్టీసీ పథకం అమలు చేయడానికి ఇబ్బందులు ఏమిటి? అని నిలదీశారు.


'రాష్ట్రంలో ప్రతి రోజూ 20 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు. రోజు మహిళల ద్వారా రూ.7 కోట్ల ఆదాయం.. నెలకు రూ.300 కోట్లు ఆదాయం వస్తోంది. ఉచిత ప్రయాణం కల్పిస్తే ఈ రూ.300 కోట్లు ఆర్టీసీ కి ఇవ్వాల్సి వస్తుంది అని భయమా?' అని సీఎం చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. 'మహిళల ఓట్లు తీసుకుని ఇప్పుడు మహిళల కోసం రూ.300 కోట్లు ఖర్చు చేయలేరా? మీ సూపర్ సిక్స్ హామీల్లో 4 పథకాలు మహిళలవే. ఇందులో ఉచిత ప్రయాణం ఒక్కటే తక్కువ ఖర్చు' అని వివరించారు.


'తక్కువ ఖర్చు పథకం మీకు అమలు చేయడానికి ధైర్యం రావడం లేదు. మీకు ఇష్టం వచ్చినప్పుడు అమలు చేస్తారా? ఇదే అమలు చేయనప్పుడు ఇక పెద్ద పథకాల సంగతి ఏంటి? ఐదేళ్లు ఇలానే కాలయాపన చేస్తారా?' అని షర్మిల సందేహం వ్యక్తం చేశారు. 'ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు భద్రత ఉంటుంది. ఎంతో మంది మహిళలు బస్సులను ఆశ్రయిస్తారు. ఇది చాలా మంచి పథకం' అని ప్రశంసలు వ్యక్తం చేశారు.


మహిళల కోసం వెంటనే పథకాలు అమలు చేయాలని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. 'ఉచిత గ్యాస్ సిలిండర్లు వెంటనే ఇవ్వాలి. మహిళల భద్రతకు చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో నెల రోజుల్లో హత్యాచారాలు మీద నివేదిక తీశాం. అన్ని పత్రికల నుంచి ఆర్టికల్స్ సేకరించాం. రూ.99కే మద్యం ఇస్తే మహిళల మీద హత్యాచారాలు పెరుగుతాయి' అని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాలని చంద్రబాబాబుకు పోస్ట్ కార్డు పంపిస్తున్నట్లు తెలిపారు.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి