జగన్కు షాక్ ఇవ్వనున్న మరో అనంత నేత !
వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా అనంతరం పురం జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత గురునాథ్ రెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అయితే గురునాథ్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరీ ఆయన చేరికన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో ప్రభాకర్ చౌదరీతో చంద్రబాబు స్వయం మాట్లాడి బుజ్జగించినట్లు తెలిసింది. ప్రభాకర్ చౌదరీ నాయకత్వంలో నే పనిచేయాల్సి ఉంటుందని ఆయన చంద్రబాబు భరోసా ఇచ్చారట. నిన్నటి వరకు గుర్నాథ్ రెడ్డి, ప్రభాకర్ చౌదరీ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి...ఇప్పుడు ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఎలా ఇముడుతారనే దానిపై సందేహాలు ఉన్నాయి. గుర్నాథరెడ్డి గురువారం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం.