ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. భారీ మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకుంది. రాత్రి 10:30 గంటలకు వరకు అందించిన సమాచారం మేరకు వైసీపీ 148 చోట్ల విజయం సాధించి మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది. టీడీపీ 21 స్థానాల్లో గెలిచి మరో 3 చోట్ల ఆధిక్యంలో ఉంది. జనసేన ఒక చోట మాత్రమే గెలుపు సాధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే 175 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో మెజార్టీ కంటే అధిక స్థానాలు గెలుచుకోవడంతో వైసీపీ అధికారంలోకి వచ్చినట్లయింది. మిగిలిన స్థానాల్లో కూడా ఫలితాలు వెలుడిన తర్వాత వైపీసీ గెలుపుపై ఈసీ ప్రకటన చేయనుంది. ఇప్పటికే మెజార్టీ స్థానాలు గెలుచుకున్న పార్టీగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ నిలవడంతో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇక లాంఛనమే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ  అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు.


మరోవైపు టీడీపీ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ప్రస్తుత సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే తదుపరి ముఖ్యమంత్రి వచ్చే వరకు అపధార్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగుతారు. ఇక జనసేన విషయానికి వస్తే జనసేన పార్టీ అధ్యక్షుడు ఓటమి పాలవగా.. ఆ పార్టీకి చెందిన రాపాక వరప్రసాద్ ఒక్కరే విజయం సాధించారు.