Best Electric Cars: దసరా పండక్కి ఎలక్ట్రిక్ కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? రూ. 10లక్షల లోపు లభించే కార్లు ఇవే

Best Electric Cars Under 10 Lakhs: దసరా పండక్కి కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నాయి. అయితే అతి తక్కువ ధరకే మీకోసం టాప్ 5 ఎలక్ట్రిక్ కారులను తీసుకవచ్చాము ఈ కార్లు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉండటంతో  ఆకట్టుకునే ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. ఎలక్ట్రిక్ కారు కొనాలని మీరు డిసైడ్ అయితే ఈ టాప్ 5 కార్లను ఓసారి చెక్ చేయండి.   

Written by - Bhoomi | Last Updated : Sep 30, 2024, 04:51 PM IST
Best Electric Cars: దసరా  పండక్కి ఎలక్ట్రిక్  కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? రూ. 10లక్షల లోపు లభించే కార్లు ఇవే

Best Electric Cars: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈవీ పరిశ్రమ ఇప్పుడు భారత్ లో సత్తా చాటుతోంది. ప్రస్తుత ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిలో కస్టమర్స్ హ్యాచ్ బ్యాక్ నుంచి సెడాన్, ఎస్ యూవీ కార్ల వరకు ఎన్నో ఆప్షన్స్ పొందుతారు. మీరు కూడా తక్కువ బడ్జెట్లో ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఆకట్టుకునే డిజైన్, అత్యాధునిక డిజైన్, లేటేస్టు ఫీచర్లతో ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

1. స్ట్రోమ్ మోటార్స్ R3 రూ. 4.50 లక్షలు: 

స్ట్రోమ్ మోటార్స్ R3 భారతదేశంలోని హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. స్ట్రోమ్ మోటార్స్ R3 ఆకట్టుకునే ఎలక్ట్రిక్ కారు, ఇది కాంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉంది.  ఇద్దరు  సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఇది మూడు డ్రైవ్ మోడ్‌లతో కూడిన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది. కీలెస్ ఎంట్రీ, పవర్ విండోస్, నావిగేషన్ సిస్టమ్‌తో అమర్చబడి ఉంటుంది. 

2. PMV EaS E రూ. 4.79 లక్షలు: 

PMV EaS E అనేది ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వాహనం. ఇది నగరాల్లో పెరుగుతున్న డిమాండ్‌తో కూడిన పర్యావరణ అనుకూలంగా ఉంటుంది. కాంపాక్ట్ సైజు, అనేక ఫీచర్లతో, పర్యావరణ అనుకూలమైన కారు కోసం సెర్చ్ చేస్తున్నవారికి ఈ  EaS E సరిగ్గా సరిపోతుంది. యాక్సెస్ చేయగల, ఫంక్షనల్,  పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ వాహనంగా, PMV EaS E  ఒక బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంది.

3. MG కామెట్ EV రూ. 6.99 లక్షలు: 

కాంపాక్ట్ మొబిలిటీ ఎంపిక కోసం చూస్తున్నారా?అయితే ఈ కారుపై ఓ లుక్కేయ్యండి.  భారతదేశంలో అందుబాటులో ఉన్న అతి చిన్న ప్యాసింజర్ కార్లలో ఇది ఒకటి. మహీంద్రా e2o ప్లస్ హ్యాచ్‌బ్యాక్ 210 AH లిథియం-అయాన్ బ్యాటరీతో క్లచ్ లేకుండా డైరెక్ట్-డ్రైవ్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానం అయి ఉంటుంది. దీని రీజెనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ  బ్రేక్‌లు వేసినప్పుడల్లా బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో చేరుకోవచ్చు. ఈ కారు రద్దీగా ఉండే ప్రాంతాల్లో నావిగేట్ చేయడానికి బెస్ట్ ఆప్షన్. 

4. టాటా టియాగో EV రూ. 7.99 లక్షలు: 

టాటా టియాగో EV మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.  ఈ 5-సీట్ల ఎలక్ట్రిక్ కారు బ్యాటరీతో నడుస్తుంది. డ్రైవింగ్‌ను ఆహ్లాదపరిచే అనేక అధునాతన ఫీచర్‌లను కలిగి ఉంది. మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, పవర్-అడ్జస్టబుల్ ఎక్స్‌టీరియర్ రియర్‌వ్యూ మిర్రర్, టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే సౌలభ్యం ఉంటుంది. ఇది ఏడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.  టాటా టియాగో EV అనేది బడ్జెట్ అనుకూలమైనది.  ఎలక్ట్రిక్ వాహనం కోసం చూస్తున్న ఎవరికైనా బెస్ట్ ఆప్షన్ అని  చెప్పవచ్చు. 

5. టాటా పంచ్ EV రూ. 10.89 లక్షలు: 

మెగా ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ మార్కెట్లోకి టాటా పంచ్ EVని విడుదల చేయడంతో చాలా మంది ఈ కారును కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  ఎందుకంటే ఈ ఆటోమొబైల్  లేటేస్ట్ టెక్నాలనీతో కచ్చితమైన ఫీచర్లను అందిస్తుంది. టాటా పంచ్ EV, విశాలమైన బూట్ స్పేస్, టెక్-అవగాహన ఫీచర్లు, అత్యంత సమర్థవంతమైన శ్రేణితో, చిన్న SUV సెగ్మెంట్‌లో విప్లవాత్మక మార్పులు చేస్తుంది. ఎలక్ట్రిక్ డ్రైవింగ్ అనేది రిలాక్స్ గా ఉంటుంది. అందుకే చాలా మంది టాటా పంచ్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News