టీడీపీ కంటే వైసీపీ డేంజరని చెప్పిన కన్నా వ్యాఖ్యలకు రోజా కౌంటర్
ఇప్పుటి వరకు బీజేపీ-టీడీపీ మధ్య జరిగిన మాటల యుద్ధం కాస్త ఇప్పుడు బీజేపీ - వైసీపీ మధ్య వార్ గా మారింది.
టీడీపీ కంటే జగన్ పార్టీ డేంజర్ అని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా చేసిన వ్యాఖ్యలను వైసీపీ మహిళా నేత రోజా ఖండించారు. బీజేపీ వారిపై ఇన్ని దాడులు చేసిన టీడీపీని వదిలేసి..తమ పార్టీ పై కన్నా ఇలా వ్యాఖ్యనించడం శోచనీయమన్నారు. టీడీపీ నేతలు స్వయంగా కన్నాపై ఇన్ని దాడులు చేశారో ఆయన ఓ సారి గుర్తుచేసుకోవాలని రోజా హితవు పలికారు. అలాగే బీజేపీ చీఫ్ అమిత్ షా తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు జరిగిన ఘటనలను కన్నా మరిచిపోయినట్లు ఉన్నారని రోజా ఎద్దేవ చేశారు.
టీడీపీ చేసిన అరచకాలను పక్కనపెట్టేసి ఇప్పుడు కన్నా కొత్త పల్లవి పాడుతున్నారని రోజా విమర్శించారు. టీడీపీ కంటే వైసీపీ అరాచక పార్టీ అని కన్నా తమ పార్టీపై బురదజల్లడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయారు. భవిష్యత్తులో టీడీపీ నేతలంతా బీజేపీలోకి చేరుతారన్న నమ్మకంతో ధీమాతో ఉన్న కన్నా..ఇక టీడీపీకి పక్కన పెట్టి ఏపీలో బలంగా ఉన్న వైసీపీ ని టార్గెట్ చేస్తున్నారని రోజా ఆరోపించారు. ఇలాంటి రాజకీయాలకు ఎలా తిప్పికొట్టాలో తమకు తెలుసు అని రోజా పేర్కొన్నారు.
ఎన్నికల అనంతరం టీడీపీ-వైసీపీకి సమదూరం పాటిస్తున్న ఏపీ బీజేపీ నేతలు.. ఒక వైపు టీడీపీ ఆరోపణలు చేస్తూనే అవకాశం దొరికినప్పుడల్లా వైసీసీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ విషయంలో మరింత బీజేపీ చీఫ్ కన్నా మరింత దూకుడు పెంచారు. వైసీపీ గురించి కన్నా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా వైసీపీ సర్కార్ పనిచేయడం లేదని..క్షేత్ర స్థాయిలో పరిశీలించినట్లయితే టీడీపీ కంటే వైసీపీ మరింత ప్రమాదకరంగా మారందని మీడియా సమావేశంలో ఆయన కామెంట్ చేశారు. వైసీపీని టార్గెట్ చేస్తూ ప్రస్తుతం కన్నా చేసిన వ్యాఖ్యలు చర్చనీయంశంగా మారాయి. ఈ నేపథ్యంలో కన్నా వ్యాఖ్యల పై స్పందించిన రోజా ఈ మేరకు కౌంటర్ ఇచ్చారు