Chandrababu Naidu First Sign: ఐదేళ్లలో సంక్షేమం బాగానే నిరుద్యోగులకు మాత్రం అన్యాయం జరిగింది. ఇదే కారణంతో నిరుద్యోగులంతా కూటమికి జై కొట్టారు. ఇప్పుడు ఆ కూటమి తరఫున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయన ప్రమాణం రోజే తమ ఆశలు తీరుతాయనే ఆనందంతో మునిగారు. సీఎంగా తొలి సంతకం తమ ఉద్యోగాలకు సంబంధించి ఉంటాయనే ఆశల్లో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో బాబు అదే హామీ ఇచ్చారు. సీఎంగా ప్రమాణస్వీకారం నాడే మెగా డీఎస్సీ ప్రకటిస్తానని చెప్పడంతో ఇప్పుడు నిరుద్యోగులంతా మెగా డీఎస్సీ ప్రకటన కోసం కళ్లల్లో వత్తులు వేసుకుని మరి చూస్తున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Kesineni Nani: కేశినేని నాని రాజకీయాలకు గుడ్‌ బై.. తమ్ముడి చేతిలో ఓటమి తట్టుకోలేకనా?


టీడీపీ, జనసేన కూటమి తమ ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. అందులో భాగంగా డీఎస్సీపై కూడా మాటిచ్చారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో బాబును కలిసిన ఓ యువతి పెన్నును బహుమతిగా ఇచ్చింది. ఆ పెన్నుతోనే సీఎం అయ్యాక మెగా డీఎస్సీపై సంతకం చేయాలని కోరింది. దీంతో ఆ పెన్నును చంద్రబాబు జాగ్రత్తగా పెట్టుకున్నారు. ప్రమాణస్వీకారం రోజే అదే పెన్నుతో సంతకం చేస్తారనే ఆశలో నిరుద్యోగులు ఉన్నారు.

Also Read: Chandrababu Convoy: చంద్రబాబు కొత్త కాన్వాయ్‌ ప్రత్యేకతలు ఇవే.. భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంటాయో తెలుసా?


 


గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్‌ వద్ద ప్రమాణస్వీకార కార్యక్రమంలో చంద్రబాబు 30 వేల పోస్టులతో కూడిన మెగా డీఎస్సీ ఉద్యోగ ప్రకటనపై సంతకం చేస్తారని ఏపీ వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. జగన్‌ ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీని రద్దు చేసి మభారీ పోస్టులతో కొత్తగా నోటిఫికేషన్‌ వేయబోతున్నారని సమాచారం. దీంతో చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజు తమకు పండుగ ఉంటుందనే భావనలో నిరుద్యోగ లోకం భావిస్తోంది. మరి వారి కల తీరుతుందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter