/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Kesineni Nani: ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రజాక్షేత్రంలో తీవ్ర భంగపాటు ఎదురైన వారిలో కొందరు రాజకీయాలను వీడుతున్నారు. ఎన్నికలకు ముందు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్‌ రాజకీయాలకు వీడ్కోలు పలకగా.. తాజాగా సొంత తమ్ముడి చేతిలో భారీ ఓటమిని చవిచూసిన కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా నాని ప్రకటన చేశారు.

Also Read: Chandrababu Convoy: చంద్రబాబు కొత్త కాన్వాయ్‌ ప్రత్యేకతలు ఇవే.. భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంటాయో తెలుసా?

'జాగ్రత్తగా ఆలోచించి.. ఆలోచించిన తర్వాత నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. నా రాజకీయ ప్రయాణాన్ని ముగించా. రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపురూపమైన గౌరవం. విజయవాడ ప్రజల స్థైర్యం, దృఢసంకల్పం నాకు స్ఫూర్తినిచ్చాయి. వారి తిరుగులేని మద్దతుకు నేను ప్రగాఢ కృతజ్ఞతలు తెలుపుతున్నా. నేను రాజకీయ రంగానికి దూరంగా ఉన్నా విజయవాడపై నా నిబద్ధత బలంగానే ఉంది. విజయవాడ అభివృద్ధికి నేను చేయగలిగిన విధంగా మద్దతు ఇస్తూనే ఉంటా. నా రాజకీయ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు' అని నాని తెలిపారు.

Also Read: Attack On Pithapuram Varma: కూటమిలో కుమ్ములాట మొదలు.. పిఠాపురంలో వర్మపై జనసైనికులు దాడి

'నేను తదుపరి అధ్యాయానికి వెళుతున్నప్పుడు నా వెంట ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలు, అమూల్యమైన అనుభవాలను తీసుకువెళ్తున్నా. విజయవాడ అభివృద్ధి, శ్రేయస్సు కోసం పాటుపడుతున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు. విజయవాడ ప్రజలకు పదేళ్లపాటు సేవ చేసే అపురూపమైన అవకాశాన్ని కల్పించినందుకు మరోసారి కృతజ్ఞతలు. హృదయపూర్వక కృతజ్ఞతతో.. ' అంటూ నాని పోస్టు చేశారు. రాజకీయాల నుంచి వైదొలగడంతో నాని అభిమానులు, మద్దతుదారులు ఖంగుతిన్నారు.

నాని నేపథ్యం
విజయవాడలో జన్మించిన కేశినేని నాని ఆర్థికంగా స్థితిమంతుడు. ఆయన కుటుంబానికి ట్రావెల్స్‌తోపాటు ఇతర వ్యాపారాలు ఉన్నాయి. కేశినేని ట్రావెల్స్‌ పేరుతో వ్యాపారంలో విజయవంతమైన ఆయన అనంతరం 2008 అక్టోబర్‌లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించాడు. మూడు నెలలు కొనసాగకుండానే 2009లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019లో జరిగిన ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ సభ్యుడిగా విజయం సాధించారు. అనంతరం 2019లోనూ మరోసారి బెజవాడ ఎంపీగా గెలిచారు. అయితే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పొసగకపోవడం.. పొమ్మనక పోగబెట్టడంతో విసుగెత్తడంతో ఈ ఏడాది జనవరి 10వ తేదీన టీడీపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మూడోసారి విజయవాడ నుంచి పోటీ చేయగా.. ఆ ఎన్నికల్లో సొంత తమ్ముడు కేశినేని చిన్ని చేతిలో పరాజయం పాలయ్యారు. ఆయన పోటీ చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కోవడంతో నాని వెనుకడుగు వేశారు. ఈ నేపథ్యంలో ప్రజా జీవితం నుంచి దూరమవుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Section: 
English Title: 
Former MP Kesineni Nani Shocking Decision He Announces Political Retirement Rv
News Source: 
Home Title: 

Kesineni Nani: కేశినేని నాని రాజకీయాలకు గుడ్‌ బై.. తమ్ముడి చేతిలో ఓటమి తట్టుకోలేకనా?

Kesineni Nani: కేశినేని నాని రాజకీయాలకు గుడ్‌ బై.. తమ్ముడి చేతిలో ఓటమి తట్టుకోలేకనా?
Caption: 
Kesineni Nani Political Retirement (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Kesineni Nani: కేశినేని నాని రాజకీయాలకు గుడ్‌ బై.. తమ్ముడి చేతిలో ఓటమి తట్టుకోలేకనా?
Ravi Kumar Sargam
Publish Later: 
No
Publish At: 
Monday, June 10, 2024 - 18:55
Created By: 
Ravi Kumar Sargam
Updated By: 
Ravi Kumar Sargam
Published By: 
Ravi Kumar Sargam
Request Count: 
14
Is Breaking News: 
No
Word Count: 
371