Eluru Rape Case: ప్రజలను రక్షించాల్సిన పోలీస్ అధికారి నీచానికి పాల్పడ్డాడు. ఏలూరులో ఓ యువతిపై సీఐ అత్యాచారానికి (police raped) పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గతంలో యువతిపై సీఐ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు తాజాగా బయటపడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే...


పశ్చిమ గోదావరి జిల్లా (west godavari district) ఏలూరులో (Eluru ) ట్రాఫిక్ విభాగంలో సీఐగా బాల రాజాజి ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అయితే గతంలో అతడు ఏలూరు వన్ టౌన్ లో సీఐగా (CI) పనిచేశారు. ఈ సమయంలోనే అతడు ఓ యువతిని బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా ఆ విషయాన్ని యువతి బయటపెట్టడంతో..ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. యువతిపై అత్యాచార ఆరోపణల నేపథ్యంలో సదరు సీఐ రాజాజిని వీఆర్ కి తరలించారు ఉన్నతాధికారులు. అలాగే ఈ కేసును (Eluru rape case) సుమోటోగా తీసుకుని అత్యాచార ఘటనపై విచారణ చేయాలని డిఎస్పీ దిలీప్ కిరణ్ ని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశించారు.


Also Read: Video: బాయ్‌ఫ్రెండ్ కోసం పబ్లిక్‌లో కసితీరా కొట్టుకున్న వైజాగ్ గర్ల్స్...


ఈ ఘటనపై మహిళలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పోలీసు అధికారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. రక్షించాల్సిన పోలీసులే ఇలాంటి దారుణాలకు పాల్పడితే..రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook