Nandigama Youth Suicide: లండన్‌లో ఉన్నత చదువులు చదివేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. మరికొన్ని గంటల్లో ఫ్లైట్ ఎక్కి లండన్ చేరుకోవాల్సి ఉంది. ఈలోపు ఫ్రెండ్స్‌ను కలిసి వస్తానని చెప్పి బయటకు వెళ్లి.. ఎంతకు తిరిగి ఇంటికి రాలేదు. చివరికి ఓ కాల్వ గట్టుపై ఉరివేసుకుని శవమై తేలాడు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. ఈ విషాదకర ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా..  
 
నందిగామ మండలం హనుమంతుపాలెం గ్రామానికి చెందిన వెంకట నారాయణ, రాణి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి పెద్ద కొడుకు గోపీకృష్ణ ప్రస్తుతం లండన్‌లో ఎంఎస్‌ చదువుతున్నాడు. రెండో కొడుకు శివకృష్ణ (24) కూడా ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున 2.15 గంటలకు శంషాబాద్‌లో విమానం ఎక్కేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంగళవారం మధ్యాహ్నం స్నేహితులను కలిసి వస్తానని బయటకు వెళ్లిన శివకృష్ణ సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. ఫ్లైట్‌కు టైమ్ అవుతుందని తండ్రి వెంకట నారాయణ ఫోన్ చేయగా.. ఇంకా సమయం ఉందని ఇంటికి వస్తున్నాని చెప్పాడు శివకృష్ట. ఆ తరువాత సెల్‌ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. రాత్రి అయినా కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అతని కోసం గాలించగా ఎక్కడ ఆచూకీ లభించలేదు.


బుధవారం ఉదయం పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట సమీపంలోని NSP కాల్వ కట్ట పక్కన చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. స్థానికులు గుర్తించి.. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. తండ్రి, కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని కన్నీటి పర్యాంతమయ్యారు. లండన్ వెళ్లి ఉన్నత చదువులు చదువుకుని ప్రయోజకుడు అవుతాడనుకుంటే.. ఇంతలో అవుతుందని ఊహించలేదని బోరున విలపించారు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థంకావడం లేదన్నారు. 


తమ కుమారుడికి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్ధం కావడం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. తమకు ఏ సమస్యనూ చెప్పలేదని.. లండన్‌ వెళ్లే ముందు స్నేహితులకు, బంధువులకు విందు కూడా ఇచ్చారని చెప్పుకొచ్చారు. అలాగే శివకృష్ణ ఇంటి నుంచి వెళ్లే సమయంలో కూడా సంతోషంగానే ఉన్నాడని తల్లిదండ్రులు అంటున్నారు. అతడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలపై పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పెనుగంచిప్రోలు ఎస్సై హరిప్రసాద్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Also Read: Ind Vs SL: సిరీస్‌ విజయంపై భారత్ కన్ను.. ఆ ప్లేయర్‌ను ఆపితేనే..!  


Also Read: India vs Sri Lanka: విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మధ్య విభేదాలు.. నెట్టింట వీడియో వైరల్ 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి