Ys Jagan Assets: ఏపీలో వివిధ పార్టీలో అభ్యర్ధుల నామినేషన్లతో పాటు సమర్పిస్తున్న ఎన్నికల అఫిడవిట్లలో సంచలన విషయాలు కన్పిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ తరపున పులివెందులలో ఒక సెట్ నామినేషన్ దాఖలైంది. మరో సెట్‌ను స్వయంగా ఏప్రిల్ 25వ తేదీన జగన్ దాఖలు చేయవచ్చు. వైఎస్ జగన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ వివరాలు ఓసారి పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్థుల విలువ 757.65 కోట్లుగా ఉంది. 2019 ఎన్నికల నాటికి ఆయన ఆస్థి విలువ 375 కోట్లుగా ఉంది. అంటే ఐదేళ్లలో 41 శాతం పెరిగింది. గత ఐదేళ్లలో వైఎస్ జగన్ ఆస్థి 154 కోట్లు పెరిగినట్టు అఫిడవిట్‌లో చూపించారు. ఇక కుటుంబ ఆస్థి 2019 నాటికి 510 కోట్లు కాగా ఇప్పుడు 247 కోట్లు పెరిగింది. వైఎస్ జగన్ పేరుతో 529 కోట్ల విలువైన స్థిర, చరాస్థులున్నాయి. కుటుంబంలో ఎవరికీ సొంతంగా కారు కూడా లేదట. చేతిలో ఉన్న నగదు కూడా కేవలం 7 వేల రూపాయలు. 


ఇక జగన్ ఇద్దరు కుమార్తెల పేరిట 51 కోట్ల ఆస్థులున్నాయి. ఐదేళ్ల క్రితం ఈ ఇద్దరి పేరిట 11 కోట్ల ఆస్థులున్నాయి. జగన్ భార్య భారతి పేరిట 124 కోట్ల ఆస్థి ఉంది. ఇక ఇడుపులపాయలో జగన్‌కు 35 ఎకరాల భూమి ఉంది. ఇడుపులపాయ, భాకరాపురం, బంజారాహిల్స్, సాగర్ సొసైటీలో ఆస్థులున్నాయి. వ్యవసాయేతర భూముల విలువ 46 కోట్లుగా అఫిడవిట్‌లో చూపించారు. ఇక వైఎస్ భారతి పేరిట 5.5 కోట్ల విలువ చేసే ఆరున్నర కేజీల బంగారం, వజ్రాలున్నాయి. అంతేకాకుండా వైఎస్ జగన్, వైఎస్ భారతి, కుమార్తెల పేరుతోల రిలయన్స్, జియో ఫైనాన్షియల్స్‌లో పెట్టుబడులున్నాయి. 


జగన్‌పై కేసులు


వైఎస్ జగన్‌పై మొత్తం 26 కేసులున్నాయి. ఇందులో 11 సీబీఐ కేసులు కాగా, 9 ఈడీ కేసులున్నాయి. ఇవి కాకుండా వివిధ పోలీస్ స్టేషన్లలో 6 కేసులున్నాయి. వైఎస్ జగన్ ఎన్నికల అఫిడవిట్‌ను ఈసారి పులివెందులలో కాకుండా రాజమండ్రిలో తయారు చేయించారు. స్టాంప్ పేపర్లను విజయవాడలో కొనుగోలు చేశారు. 


Also read: YCP Election Manifesto: ఎన్నికల మేనిఫెస్టో వైసీపీకు గేమ్ ఛేంజర్ అవుతుందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook