YS jagan hot comments on chandrababu naidu: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ లోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. ముఖ్యంగా పిఠాపురం నియోజక వర్గంపరిధిలోని.. ఏలేరుముంపు గ్రామాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఏలేరు ముంపుకు గురైన ప్రజలతో మాట్లాడి వారి బాధలను విన్నారు. విజయవాడ మాదిరిగా.. ఏలేరురిజర్వాయర్ లో కూడా మానవ తప్పిదాల వల్ల సంభవించిన వరదలు అంటు మండిపడ్డారు. ఏలేరును దివంగత మహానేత వైఎస్సార్.. 2008 లో ప్రారంభిచారని గుర్తు చేశారు. కానీ 2014 సీఎం అయ్యాక చంద్రబాబు ఏమాత్రం పట్టించుకొలేదన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేవలం అంచనాలను మాత్రం పెంచారన్నారు. 2015 లో.. రూ. 295 కోట్లకు అంచనా వ్యయం పెంచిన కూడా పనులు పూర్తికాలేదన్నారు. ఇదిలా ఉండగా.. ఆగస్టు 31 న వాతావరణ కేంద్రం.. వరదలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పిన కూడా.. చంద్రబాబు సర్కారు పూర్తిగా నెగ్లీజెన్సీ గా వ్యవహారించదని అన్నారు.  ఏలేరులోకి వరద వస్తుందని తెలిసిన కూడా.. ఏపీ ప్రభుత్వం.. ఫ్లడ్ కుషన్ మెయింటైన్ చేయలేదని విమర్శించారు.


చంద్రబాబు ప్రభుత్వం రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ చేయించలేదని ఎద్దేవా చేశారు. ఒకవేళ .. ఇదే జగన్ ప్రభుత్వం ఉంటే వరదలకు నష్టపోయిన రైతులకు 45వేల రూపాయల వరకు అందేవని అన్నారు. ఏపీలో  అధికారం చేపట్టిన .. నాలుగు నెలలకే చంద్రబాబు  పరిపాలన ఏంటో ప్రజలకు అర్థమైందన్నారు. అందుకే ప్రజలు..  ప్రభుత్వంపై తిరగబడి రోడ్లపైకి వస్తున్నారని విమర్శించారు.


Read more: Viral Video: బాబోయ్.. సమోసాలో ‘కప్పకాలు’.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో..


అంతేకాకుండా.. గతంలో ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన..సూపర్ సిక్స్ హామీలు ఎందుకు అమలు చేయడం లేదని వైఎస్ జగన్  ప్రభుత్వాన్ని నిలదీశారు. మరోవైపు మాజీ సీఎం వైఎస్ జగన్..  పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏదో పనిచేసినట్లు నటిస్తున్నారన్నారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మాత్రం... చంద్రబాబులా నటించడం తెలియట్లేదన్నాని సెటైర్ లు వేశారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.