Frog leg in samosa video goes viral: సాధరణంగా చాలా మంది తమ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీస్ తో హోటల్స్ లు, రెస్టారెంట్ల కు వెళ్తుంటారు. తమకు నచ్చిన ఫుడ్ లను ఆర్డర్ పెట్టి తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాలలో రెస్టారెంట్ లు లేదా హోటల్స్ లకు వెళ్లిన వారికి అనుకొని ఘటనలు ఎదురౌతుంటాయి. కొన్నిసార్లు ఆర్డర్ లు పెట్టిన ఫుడ్ లో.. బల్లులు, బొద్దింకలు చివరకు చనిపోయిన పాములు సైతం.. బైటపడ్డ ఘటనలు వార్తలలో నిలిచాయి.
गाजियाबाद, UP में समोसे के अंदर मेंढक की टांग निकली है। मामला बीकानेर स्वीट्स का है। पुलिस ने दुकानदार को कस्टडी में लिया। फूड विभाग ने सैंपल जांच को भेजे। pic.twitter.com/SBcsEs8nMr
— Sachin Gupta (@SachinGuptaUP) September 12, 2024
ఇటీవల కాలంలో.. ఒక ఐస్ క్రీమ్ లో మనిషి వేలు కూడా బైటపడింది. చాలా హోటల్స్ లలో.. ఫుడ్ సెఫ్టీ నియమాలు పాటించకుండా.. కస్టమర్ల ప్రాణాలు రిస్క్ లో పెట్టేలా పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పూర్తి వివరాలు..
ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న.. అమన్ శర్మ అనే యువకుడు తన ఫ్రెండ్స్ తో కలిసి. బికనీర్ స్వీట్ షాపుకు వెళ్లారు. అక్కడ సమోసాలను ఆర్డర్ చేశాడు. ఈ నేపథ్యంలో వారికి అనుకొని ఘటన చోటు చేసుకుంది. సమోసాలు తినేందుకు ప్రయత్నించగా.. సమోసాలో కప్ప కాలు బైటపడింది. దీంతో అతను షాక్ కు గురయ్యాడు.
వెంటనే ఓనర్ కు చూపించాడు.దీనిపై అతను కూడా పట్టనట్టుగా ప్రవర్తించాడు. దీంతో అతను పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఘటనపై ఆరాతీశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఫుడ్ సెఫ్టీ అధికారులు రంగంలోకిదిగి, సమోసాలోని అవశేషాలను సేకరించారు.
Read more: Snake news: చేపను చూసి టెంప్ట్ అయిన పాము.. చూస్తుండగానే ఊహించని బిగ్ ట్విస్ట్.. ఎక్కడో తెలుసా..?
ల్యాబ్ లలో టెస్టుల కోసం పంపించారు. రిపోర్టు వచ్చిన తర్వాత సదరు షాపుపై చర్యలు తీసుకుంటామని కూడా ఫుడ్ సెఫ్టీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మాత్రం.. సమోసాలో కప్పకాలుకు చెందిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.