దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ (Former cm ysr) స్వప్నమైన త్రిబుల్ ఐటీ (IIIT) ల అభివృద్ధికి ఏపీ సీఎం వైఎస్ జగన్ ( Ap cm ys jagan) సంకల్పించారు. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలో ఉన్న త్రిపుల్ ఐటీలో 190 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. త్రిబుల్ ఐటీను పూర్తి స్థాయిలో తీర్దిదిద్దనున్నట్టు వైెఎస్ జగన్ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కడప జిల్లా వైెఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత ముఖమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ ( ys jagan) శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ఆర్కేవ్యాలీ ( Rk valley) లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం 190 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వీటిలో 139 కోట్ల అంచనాతో నిర్మించిన కొత్త అకాడెమిక్ కాంప్లెక్స్‌ను ఆవిష్కరించారు. ఈ కాంప్లెక్స్ లో ఈసీఈ, ఎంఎంఈ, త్రిబుల్ ఈ, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ భవనాలతో పాటు మురుగునీటి శుద్ధి కర్మాగారం, 11 కేవీ సబ్ స్టేషన్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, పైర్ ఫైటింగ్ సిస్టమ్ లున్నాయి. మరో పదికోట్ల అంచనాతో కంప్యూటర్ సెంటర్ కు సీఎం జగన్ ( cm jagan) శంకుస్థాపన చేశారు. ఇవి కాకుండా అంతర్జాతీయ స్థాయి ఆడిటోరియంను త్రిబుల్ ఐటీ (IIIt campus) ఆవరణలో నిర్మించనున్నారు. త్రిబుల్ ఐటీను ఐఐటీ స్థాయిలో తీర్దిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఈ అభివృద్ధి పనుల్ని చేస్తున్నట్టు సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న మరో త్రిబుల్ ఐటీ నూజివీడు క్యాంపస్ ( Nuzividu IIIt campus) ను కూడా త్వరలో అభివృద్ధి చేయనున్నారు. Also read: YSR Jayanti: ఘనంగా వైఎస్ఆర్ జయంతి