Paderu Politics: పాడేరు వైసీపీలో వార్.. తగ్గేదెవరు?
Paderu Ycp war: ఆ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. రాష్ట్రం వచ్చాక జరిగిన మూడు ఎన్నికల్లో అక్కడ వైసీపీ అభ్యర్ధులే గెలిచారు. కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ముసలం పుట్టింది. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా సీన్ మారిపోయింది. ఇద్దరు నేతలు ఎక్కడా తగ్గకపోవడంతో.. రానున్న రోజుల్లో ఏం జరగబోతోందని అటు పార్టీ పెద్దలు కూడా తెగ టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం.. అంతలా తగువులాడుకుంటున్న నేతలెవరు..!
Paderu Ycp war: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అధికారంలో కోల్పోయాక డీలా పడిన పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ఆ పార్టీ అధినేత జగన్ తెగ ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈనేపథ్యంలోనే అల్లూరి జిల్లా పాడేరు వైసీపీలో లుకలుకలు మరోసారి భగ్గుమన్నాయి. ఎమ్మెల్యేమత్స్యరాజు విశ్వేశ్వర రాజు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మధ్య వివాదం తారాస్థాయికి చేరడంతో ఏం జరుగుతుందో తెలియక క్యాడర్ కూడా తెగ పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తోంది..
ఇక అల్లూరీ సీతారామరాజు జిల్లాలోని పాడేరులో వైసీపీ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేస్తోంది. ఆ నియోజకవర్గంలో 2014 నుంచి వరుసగా వైసీపీ గెలుస్తోంది. 2014 లో పాడేరులో తొలిసారి వైసీపీ జెండా ఎగిరింది. అక్కడ గిడ్డి ఈశ్వరి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2014లో కొత్తగుల్ల భాగ్యలక్ష్మికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో ఆమె విజయం సాధించారు. తాజాగా పాడేరులో భాగ్యలక్ష్మికి టికెట్ ఇవ్వలని జగన్.. మత్స్యరస విశ్వేశ్వర రాజుకు టికెట్ ఇవ్వడంతో ఆయన గెలుపొందారు. కానీ కొత్త ఎమ్మెల్యేకు ఒక్కసారి కూడా అధ్యక్ష అనే యోగం లేకుండా పోయిందట. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక.. వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటోంది. ఇదే సమయంలో సొంత పార్టీ నుంచే మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి నేరుగా ఎమ్మెల్యేను టార్గెట్ చేయడంతో కొత్త ఎమ్మెల్యేకు తెగ ఇబ్బందిగా మారందని చెబుతున్నారు.
ఇద్దరు ఒకే పార్టీ లీడర్లు అయినప్పటికీ.. ఉప్పునిప్పులా రాజకీయం చేస్తున్నారట. ముఖ్యంగా పాడేరులో మత్స్యరస విశ్వేశ్వర రాజు ఎమ్మెల్యే అయ్యాక.. అభివృద్ది పనులు పడకేశాయట. ఇదే విషయాన్ని భాగ్యలక్ష్మి వర్గం తెగ ప్రచారం చేస్తోందట. ఇలా భాగ్యలక్ష్మి వర్గం నేరుగా టార్గెట్ చేయడంతో ఎమ్మెల్యే వర్గం ఉక్కిరిబిక్కిరి అవుతోందట. మరోవైపు గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడు టీడీపీలో కొనసాగుతున్న గిడ్డి ఈశ్వరి కూడా ఎమ్మెల్యేను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. మత్స్యరస విశ్వేశ్వర రాజు ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోర్టుకు వెళ్లారట. దీనికి భాగ్యలక్ష్మి కూడా పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. అందుకే ఇద్దరు నేతల మధ్య కొత్త ఎమ్మెల్యే నలిగిపోతున్నట్టు తెలుస్తోంది.
మొత్తంమీద పాడేరులో వైసీపీలో అంతర్గత పోరుపై వైసీపీ హైకమాండ్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే ఇద్దరు నేతలు పిలిచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. అయితే పార్టీ పెద్దలు వార్నింగ్ ఇచ్చినా ఇద్దరు నేతలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదట. దాంతో పాడేరులో ఏం జరుగుతుందో అని క్యాడర్ మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారట. ఎవరివెంట నడిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని కొందరు నేతలతే ఇళ్లకే పరిమితం అవుతున్నారని తెలుస్తోంది. అయితే వైసీపీలో కుమ్ములాటపైన పార్టీ పెద్దలు సీరియస్‌గా చర్యలు తీసుకుంటేగానీ నేతలు దిగిరారని గుసగుసలాడుకుంటున్నట్టు తెలుస్తోంది.
Also Read: BJP Telangana: మంత్రి ఉత్తమ్ దెబ్బకు.. బీఆర్‌ఎస్ కుదేలు..!
Also Read: Konda Surekha: మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ.. ఈ సారి ఏంచేశారంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.