BJP Telangana: సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ కష్టాలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పార్టీమారక కారు నడిపే డ్రైవర్ లేక క్యాడర్ మొత్తం పక్కచూపులు చేస్తోంది. ఏడాది కాలంగా నియోజకవర్గానికి కొత్త ఇంచార్జ్‌ను నియమించకపోవడంతో.. పార్టీ శ్రేణులు కూడా పరేషన్ అవుతున్నారు. నియోజకవర్గానికి ఓ మాజీమంత్రిని బాధ్యతలు తీసుకోవాలని సూచిస్తున్నా..ఆయన మాత్రం నాకొద్దని చెబుతుండటంతో క్యాడర్ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది..
ఇక హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట.. అక్కడ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా ఏళ్లుగా పోటీ చేస్తున్నారు. కానీ 2019లో మాత్రం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎమ్మల్యేగా గెలిచినా అక్కడ రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేశారు. దాంతో హుజూర్‌నగర్‌లో జరిగిన ఉప ఎన్నికలో శానంపూడి సైదిరెడ్డి భారీ విజయం సాధించారు. అయితే ఐదేళ్లు తిరగక ముందే సైదిరెడ్డి పార్టీ మారారు.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవాలో సైదిరెడ్డి ఓటమి పాలయ్యారు. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ విజయం సాధించారు. ఆ తర్వాత పార్లమెంటు జరిగిన ఎన్నికల్లో అనుహ్యరీతిలో సైదిరెడ్డి పార్టీ మారారు. దాంతో ఆయన్ను కమలం పార్టీ నల్గొండ ఎంపీగా బరిలో దింపింది. కానీ ఆయన అక్కడ కూడా ఓడిపోవడంతో సైలెంట్ అయ్యారు.
అటు 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత హుజూర్ నగర్‌లో గులాబీ పార్టీ చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. సైదిరెడ్డి పార్టీ మారక మాత్రం హుజూర్ నగర్‌లో పార్టీని ముందుకు నడిపే లీడర్ లేకుండా పోయారు. ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ పార్టీ నడిపేందుకు నాయకుడు లేకుండా పోయారని క్యాడర్ వాపోతోంది. అయితే సైదిరెడ్డి పార్టీ మారే సమయంలో కొందరు లీడర్లు మాత్రమే ఆయన వెంట నడిచారు. మరికొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఎక్కువమొత్తంలో నేతలు మాత్రం ప్రస్తుతం కారు పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారు. అయితే ఇప్పుడు తమను ముందుకు నడిపే లీడర్ కావాలంటూ వారంతా హైకమాండ్‌ను కోరుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు తామంతా సిద్దంగా ఉన్నా.. నడిపించే నాయకుడు లేకుండా పోయారని చెప్పారట. కనీసం జిల్లాలో బీఆర్‌ఎస్‌కు పెద్దదిక్కుగా ఉన్న మాజీమంత్రి జగదీష్ రెడ్డిని అయినా హుజూర్ నగర్ ఇంచార్జ్ బాధ్యతలు తీసుకోవాలని కోరుతున్నా.. ఆయన మాత్రం ససేమీరా అంటున్నట్టు సమాచారం.
మొత్తంగా పార్టీ మారిన చాలా నియోజకవర్గాలకు ఇప్పుడిప్పుడే కొత్త ఇంచార్జ్‌లను బీఆర్‌ఎస్ నియమిస్తోంది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కొత్తగా బాధ్యులను నియమిస్తోంది. అయితే హుజూరాబాద్‌లో మాత్రం సరైన నేత కోసం అన్వేషణ చేస్తున్నట్టు సమాచారం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బలంగా ఢీకొట్టే నేత అయితేనే అక్కడ రాజకీయం రసవత్తరంగా చేయొచ్చని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారట. అందుకే కారు నడిపే సరైన డ్రైవర్ కోసం అన్వేషణ చేస్తున్నట్టు సమచారం.. చూడాలి మరి హుజూర్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌కు కొత్త ఇంచార్జ్‌గా ఎవరిని నియమిస్తారో అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
Also Read: Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప 2 టికెట్ల రేట్లు తగ్గింపు... ఎప్పటినుంచంటే..?
Also Read: EX CM KCR: కేసీఆర్ రీ ఎంట్రీకి.. ముహూర్తం ఫిక్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.