Jagan fires on cm Chandrababu naidu in tadepalli: ఆంధ్ర ప్రదేశ్ లో లిక్కర్ మాఫీయా నడుస్తొందని మాజీ సీఎం జగన్ అన్నారు. ఈ క్రమంలో తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కారుపై మండిపడ్డారు. ఇటీవల ఏపీ సర్కారు వాటాలు వేసుకుని మరీ కొత్త మద్యం పాలసీలు తీసుకొచ్చారన్నారు. కొత్త బ్రాండ్లు అంటూ ప్రజల్ని మోసం చేశారన్నారు. చంద్రబాబు పాలనలో కేవలం.. దోచుకో, పంచుకో, తినుకో మాత్రమే కన్పిస్తున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూపర్ సిక్స్‌ లేదు....సూపర్ సెవన్ లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలన్ని ఏమయ్యాయని ఎద్దేవా చేశారు. ఉచిత ఇసుక అంటూ కూడా ప్రజల్ని మోసం చేశారన్నారు. ఏపీ కూటమి సర్కారు కనీసం బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టలేని స్థితిలొ లేదన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ తో ప్రభుత్వాన్ని నడపడం ఎక్కడ చూడలేదన్నారు. ఏమాత్రం అమలుకు సాధ్యంకానీ హమీలన్ని ఇచ్చి, ఇప్పుడు ప్రజల్ని ప్రతి విషయం నుంచి డైవర్ట్ చేస్తున్నారన్నారు.


 ఇటీవల ఏపీ సర్కారు తీసుకొచ్చిన మద్యం పాలసీలో మాఫీయా ఉందన్నారు. నేతలే నిస్సిగ్గుగా.. మద్యం వెనుక ఉండి.. ప్రజల్ని దోచుకుంటున్నారన్నారు. గతంలో తక్కువ ధరకే మద్యం అని చెప్పి.. ఇప్పుడేమో.. ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. మద్యం షాపుల్లో పెద్ద స్కామ్ జరిగిందన్నారు. అంతేకాకుండా.. ఎమ్మార్పీ కంటే భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు డైవర్ట్ పాలిటిక్స్ చేయడంలో, అబద్దాలకు రెక్కలు తొడగటంలో ఎక్స్ పర్ట్ అన్నారు.


Read more: Liquor Bottle Price: మందుబాబులకు పండగే పండగ.. క్వార్టర్ బాటిల్‌ ధర కేవలం రూ.99 ఆ రోజు నుంచే అమలు..!


సీమెన్స్ ప్రాజెక్ట్ కోసం చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేశారన్నారు. సీమెన్స్ ప్రాజెక్ట్ కోసం చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేశారని గుర్తు చేశారు. అదే విధంగా బినాబీ కంపెనీల ద్వారా రూ. 371 కోట్ల నిధులు దారి మళ్లీంచారన్నారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు లేని పోనీ ప్రచారాలు చేసుకున్నారని, అందుకే ఈడీ ఆస్తుల్ని అటాచ్ చేసిందని విషయం గుర్తు చేశారు.


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter