YS Jagan Sharmila: ఒకే వేదికపై వైఎస్ జగన్, షర్మిల.. ఆరోజు ఏం జరగబోతున్నది?
YS Jagan Sharmila Meet For YSR Birth Anniversary: రాజకీయంగా బద్ధ శత్రువులుగా విడిపోయిన అన్నాచెల్లెలు మాజీ సీఎం వైఎస్ జగన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఒకే వేదికపై చేరనున్నారా? వారిద్దరి మధ్య వివాదాలు సమసిపోయాయా? అనేది ఆసక్తికరంగా మారింది.
YS Jagan Sharmila Meet: అన్నాచెల్లెలు రాజకీయ ప్రత్యర్థులుగా విడిపోయిన తర్వాత తొలిసారి కలవబోతున్నారా? ఎన్నికల్లో శత్రువుల్లా మారిన వారిద్దరూ మళ్లీ ఒకచోటకు చేరనున్నారా? అంటే ఔననే తెలుస్తోంది. తొలిసారి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఒకే వేదికపై చేరనున్నారని సమాచారం. దీనికి వారి తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి కార్యక్రమం వేదికగా కానున్నది. అయితే ఆ వర్ధంతి సందర్భంగా వీరిద్దరూ ఒకే చోట కనిపిస్తుండడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Also Read: YS Jagan Case: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు భారీ ఎదురుదెబ్బ.. త్వరలోనే జైలుకు?
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఒకే వేదికపైకి రానున్నారు. 2024 ఎన్నికల్లో జగన్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఆయన ఓటమికి కారణమైన షర్మిల వారిద్దరూ ఒకే వేదిక మీద కలుసుకోనుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈనెల 8వ తేదీన వైఎస్సార్ 75వ జయంతి ఉంది. ఈ సందర్భంగా వారిద్దరూ ఇడుపులపాయలో ఉన్న వైఎస్సార్ సమాధి వద్ద తమ తండ్రికి నివాళులర్పించేందుకు రానున్నారు. రాజకీయ ప్రత్యర్థులుగా మారిన అన్నాచెల్లెల్లు చాలాకాలం తర్వాత ఒకే వేదికపై రానుండడం రాజకీయంగా ఆసక్తి నెలకొంది.
Also Read: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలనం.. 9 నెలల యువతి కేసు 9 రోజుల్లో పరిష్కారం
ఏపీ రాజకీయాల్లోకి అనూహ్యంగా వైఎస్ షర్మిల ప్రవేశించి సొంత అన్న జగన్‌పై ప్రత్యక్ష యుద్ధానికి దిగారు. తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను ప్రధాన అస్త్రంగా చేసుకుని ఎన్నికల్లో షర్మిల ప్రచారం చేశారు. అంతేకాకుండా సీఎంగా ఉన్న వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారు. ఎన్నికల సమయంలో జగన్, అవినాశ్ రెడ్డిపై ప్రత్యక్ష ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఎన్నికల ఫలితాలు వచ్చాయి జగన్ ప్రభుత్వం కూలిపోయింది. ఎన్నికల్లో పోటీ చేసిన షర్మిల కూడా ఓడిపోయారు. ఇప్పుడు అన్నాచెల్లెలు షర్మిల, జగన్ తర్వాత సైలెంట్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలుడిన అనంతరం వారిద్దరూ తమ తండ్రి జయంతి కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రతియేటా వీరిద్దరూ ఇడుపులపాయకు చేరుకుని నివాళులర్పించడం ఆనవాయితీ. ఇదే క్రమంలో సోమవారం వారిద్దరూ ఒకే వేదికపై కనిపించే అవకాశం ఉంది.
అయితే ఇడుపులపాయలో జరిగే వైఎస్సార్ జయంతి సందర్బంగా ఇడుపులపాయకు వీరిద్దరూ కలిసి వస్తారా? లేదా విడివిడిగా వస్తారా? అని చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల, జగన్ విడివిడిగా వైఎస్సార్‌కు నివాళులర్పించగా.. ఈసారి కూడా అలా చేస్తారా? కలిసి నివాళులర్పిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా షర్మిల ప్రత్యేకంగా విజయవాడలో వైఎస్సార్ జయంతి కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నాయకులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులను షర్మిల ఆహ్వానించిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter