YS Jagan: జనంలోకి జగన్.. 26 జిల్లాల్లో పర్యటన..
YS Jagan Tour: 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ జగన్ కు చెందిన వైయస్ఆర్సీపీ ఘోరంగా పరాజయం పాలైయింది. అంతేకాదు కేవలం 11 సీట్లకే పరిమితమై ..ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష స్థానం లేకుండా పోయింది. దీంతో అసెంబ్లీలో కూటమి నేతలది పై చేయి అయింది. ఈ నేపథ్యంలో తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ జగన్ .. శాసన సభను బాయి కాట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
YS Jagan Tour: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత YCPలో నిస్తేజం నెలకొంది. చాలా మంది ముఖ్య నేతలు సైలెంట్ గా ఉండగా.. మరికొందరు వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ పార్టీకి కాస్త దూరంగా ఉన్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వ నేతలు గతంలో తమపై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోసిన నేతలను టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమురళి, రామ్ గోపాల్ వర్మ వంటి నేతలను టార్గెట్ చేసింది. ఓ రకంగా వైసీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై కేసులు వేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఓ రకంగా గతంలో తమకు అనుకూలంగా వ్యవహరించి నేతలను కట్టడి చేస్తున్నారు. ఓ రకంగా వైసీసీ అనుకూలంగా ఉండే నేతలను అష్టదిగ్భందనం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొందరు వైసీపీ నేతలు అధికార పార్టీతో పాటు, జనసేనలోకి జంప్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. జనవరి 3వ వారంలో జనంలోకి వెళ్లనున్నారు జగన్. ప్రతి నియోజకవర్గంలో 2 రోజులపాటు సమీక్షలు నిర్వహించనున్నారు.
మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ జగన్ పర్యటన చేయనున్నారు. అయితే పార్టీ అధికారంలో ఉన్నపుడు పార్టీ శ్రేణులను దూరంగా పెట్టిన కారణంగా ఘోరంగా ఓడిపోయిందనే వారు ఉన్నారు. అధికారంలో ఉన్నపుడు పట్టించుకోని నేత.. ఓటమితో ఇపుడు జనంలోకి రావడంతో పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం పెంచడంతో పాటు వారితో ధైర్యాన్ని నింపుబోతున్నట్టు తెలుస్తోంది. పార్టీ బలోపేతంపై సామాన్య కార్యకర్తల సూచనలు, సలహాలు తీసుకోనున్నారు. ఎన్నికల సమయంలో ఏక పక్షంగా వ్యవహరించిన కారణంగా దారుణమైన ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. అందుకే తాజాగా ఎన్నికల తర్వాత కేసుల బారిన పడిన వైసీపీ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులను కలిసి మాట్లాడనున్నారు. ఇకపై తాడేపల్లిలో తనని కలిసేందుకు వచ్చిన వారిని కలవనున్నారు జగన్. అపాయింట్మెంట్ తో పనిలేకుండా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ నేతలకు ప్రత్యేకంగా కలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter