Assembly Session: అసెంబ్లీలో వైఎస్ జగన్ అడుగుపెట్టకుండానే ముగిసిన సభా సమరం
Andhra Pradesh Assembly And Council Adjourned Indefinitely: అసెంబ్లీలో మొత్తం అధికార సభ్యులే ఉన్న వేళ అసెంబ్లీ సమావేశాలు చప్పగా కొనసాగాయి. ఎలాంటి తీవ్రమైన చర్చలు లేకుండానే మండలి, అసెంబ్లీలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
AP Assembly And Council: మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తొలిసారి జరిగిన బడ్జెట్ సమావేశాలు ప్రతిపక్షం లేకుండా అధికార కూటమితో కొనసాగాయి. ప్రతిపక్షం బహిష్కరించిన వేళ జరిగిన ఈ సమావేశాలు ఎలాంటి ఉత్కంఠ.. సంచలన పరిణామాలు లేకుండానే సాదాసీదాగా ముగిశాయి. పది రోజుల పాటు సాగిన సభా సమరం చప్పగా సాగింది. ప్రజల్లో పెద్ద చర్చ లేకుండానే ఈ సమావేశాలు ముగియడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అధికార కూటమిని నిలదీసే వాళ్లు లేకపోవడంతో అసెంబ్లీ సమావేశాలు అసలు జరిగిందా? అనే సందేహం ఏర్పడుతున్న పరిస్థితి.
ఇది చదవండి: Adani Bribe: పురందేశ్వరి సంచలన ట్వీట్.. అదానీతో వైఎస్ జగన్ లంచం తీసుకున్నాడు
అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం కొత్త శాసనసభ ప్రమాణస్వీకారం చేసింది. నాడు చర్చలు ఏమీ లేకుండానే ముగిసిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన సమావేశాల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సమావేశాలు జరగ్గా అధికార కూటమి సభ్యులే చర్చలు చేశారు. తమను ప్రతిపక్షంగా గుర్తింపునివ్వకపోవడంతో నిరసనగా 11 సభ్యులు ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలను బహిష్కరించింది. దీంతో సమావేశాల్లో మొత్తం అధికార సభ్యులే ఉన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో పెద్దగా చర్చలు ఏవీ జరగకుండానే ముగిశాయి.
Also Read: Sharmila: బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. ప్రభాస్ తో నాకు ఎటువంటి సంబంధం లేదు.. షర్మిల
10 రోజుల పాటు సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగాయి. మొత్తం 59 గంటల 57 నిమిషాల పాటు సభ జరిగింది. సభ్యులు అడిగిన 75 ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు ఇచ్చారు. ఈ సమావేశాల్లోనే కొన్ని కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపింది. మొత్తం 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం లభించింది. అసెంబ్లీతోపాటు శాసన మండలి కూడా నిరవధిక వాయిదా పడింది. శాసనమండలిని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మోషేన్ రాజు తెలిపారు. మండలిలో మొత్తం 8 బిల్లులకు ఆమోదం లభించింది. గత ప్రభుత్వం చెత్త పన్ను విధిస్తూ చేసిన చట్టాన్ని మండలి రద్దు చేయడం విశేషం. లోకాయుక్త సవరణ బిల్లు 2024కు ఆమోదం పలికింది. ఇక ఇదే సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరిగింది. రఘు రామ కృష్ణ రాజు ఉప సభాపతిగా ఎన్నికయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter