Gautam Adani Bribe: దేశంలో గౌతమ్ అదానీ లంచం అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. అమెరికాలో అదానీపై కేసు నమోదవడంతో బీజేపీ, కాంగ్రెస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ సందర్భంగా రెండు జాతీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండగా.. అదానీ లంచం వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌కు లింక్ ఉండడంతో మరింత సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సంచలన ట్వీట్ చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లంచం తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆమె చేసిన ట్వీట్ తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది.
Also Read: Sharmila: బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. ప్రభాస్ తో నాకు ఎటువంటి సంబంధం లేదు.. షర్మిల
'అదానీ గ్రూప్‌పై అమెరికా దేశ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) చేసిన ఆరోపణలు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తాయి' అని దగ్గుబాటి పురంధేశ్వరి గుర్తుచేశారు. 'ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇతర అధికారులు లంచం తీసుకున్న సంఘటనలు ఉన్నాయని ఎస్‌ఈసీ పేర్కొంది' అని తెలిపారు. 'జూలై 2021 నుంచి ఫిబ్రవరి 2022 మధ్యలో ఒడిశా, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ పంపిణీ సంస్థలు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ)తో కుదుర్చుకున్న విద్యుత్ విక్రయ ఒప్పందాలు (పీఎస్‌ఏఎస్)పై అమెరికా సెక్యూరిటీ కమిషన్ ఆరోపణలు చేసింది' అని వివరించారు. 7 గిగావాట్ల సౌరశక్తిని కొనుగోలు చేసేందుకు నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ భారతదేశంలో ఎన్నడూ జరగని అతి పెద్ద ఒప్పందం' అని తెలిపారు.
ఈ సందర్భంగా ఏయే రాష్ట్రాలతో అదానీ కంపెనీ ఒప్పందం చేసుకుందో దగ్గుబాటి పురంధేశ్వరి వివరించారు. 'ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, ఒడిశాలో బీజేడీ, తమిళనాడులో డీఎంకే, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి' అని వెల్లడించారు. ఈ అవినీతి ఆరోపణలతో సంబంధం ఉన్న వ్యక్తులందరూ కాంగ్రెస్ పార్టీతో సంబంధం కలిగి ఉన్నవారే అని ప్రస్తావించారు. వారంతా బీజేపీతో ఎటువంటి సంబంధంలేని వారు అని స్పష్టం చేశారు. ఈ విషయం రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు. రాబర్ట్ వాద్రాకు అదానీకి ఉన్న సామీప్యతను మరచిపోకూడదని చెప్పారు. అదానీ అంశంలో రాహుల్ గాంధీ బీజేపీ ఎలా బాధ్యులను చేస్తాడని నిలదీశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter