ఏప్రిల్ వరకు కేంద్రం వైఖరి కోసం వేచి చూసి, అప్పటికీ కేంద్రం ఏపీకి న్యాయం చేయకపోతే, ఏప్రిల్ నెలలో తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేయడం జరుగుతుందని వైఎస్ జగన్ ప్రకటించడం అనేది రాజకీయంగా అతడికి లబ్ధి చేకూర్చే అంశమే అని అన్నారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ఎంపీల రాజీనామా ప్రకటనపై స్పందిస్తూ తాజాగా జేసీ ఈ వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

" ఏప్రిల్ తర్వాత వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేయడం ద్వారా టీడీపీపై కొంత ఒత్తిడి పెంచడమే కాకుండా జనం మధ్యలోకి వెళ్లడానికి జగన్‌కి ఓ కారణాన్ని కూడా ఇస్తుంది. అన్నింటికిమించి ఏప్రిల్ తర్వాత రాజీనామా చేస్తే ఆయా లోక్ సభ స్థానాల్లో ఉప ఎన్నికలు కూడా రావు. అటువంటప్పుడు సదరు ఎంపీలు కూడా మళ్లీ ఎటువంటి ఒత్తిడికి గురయ్యే ప్రమాదం లేదు" అని వైఎస్ జగన్‌కి జరిగే రాజకీయ లబ్ధి గురించి వివరించారు జేసీ దివాకర్ రెడ్డి. 


అయిదే, అదే సమయంలో వైసీపీ ఎంపీల రాజీనామాల ప్రభావం టీడీపీపై అంతగా పడకోపోవచ్చు అని అభిప్రాయపడిన జేసీ దివాకర్ రెడ్డి.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే విషయంలో ఇప్పటికే టీడీపీ పైచేయి సాధించడమే అందుకు కారణం అని అన్నారు.