YS Sharmila Flood Relief: ఇన్నాళ్లు సొంత అన్న పాలనపై విమర్శలు చేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడి పాలనపై విరుచుకుపడుతున్నారు. వరదల్లో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఏం చేశారని నిలదీశారు. చిన్నారుల విరాళం కాదు కేంద్రాన్ని నిలదీసి సహాయం పొందాలని సవాల్‌ విసిరారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై కూడా షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర వరదలు వచ్చినా రూపాయి సహాయం కూడా చేయలేదని మండిపడ్డారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Big Shock YS Jagan: మరింత కష్టాల్లోకి మాజీ సీఎం జగన్‌.. జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే?


 


విజయవాడలో వరదలకు తీవ్రంగా ప్రభావితమైన పాత రాజరాజేశ్వరి పేటలో మంగళవారం వైఎస్‌ షర్మిల పర్యటించారు. వరద బాధితులను కలిసి వారి కష్టాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ షర్మిల గత సీఎం వైఎస్‌ జగన్‌తోపాటు ప్రస్తుత సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. 'బుడమేరు వరదపై టీడీపీ-వైసీపీ బురద రాజకీయాలు చేస్తున్నాయి. వైఎస్సార్ మరణం తర్వాత బుడమేరును పట్టించుకున్న వాళ్లు లేరు. బుడమేరు వరదకు చంద్రబాబు, జగన్‌ ఇద్దరూ కారణమే' అని సంచలన ప్రకటన చేశారు.

Also Read: Pithapuram Floods: వరదల్లో డిప్యూటీ సీఎం ఇంటి స్థలం.. హైదరాబాద్‌లో పవన్‌ కల్యాణ్‌


 


'వరదల్లో ఇప్పటివరకు 50 మంది చనిపోయారు. దాదాపు 7 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వరదలకు రూ.6,800 కోట్లు నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు చెప్పారు. అయినా కేంద్రం ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆంధ్ర మీద కేంద్రానికి ఎందుకు సవతి తల్లి ప్రేమ..? ఆంధ్ర ఎంపీలతో అధికారం అనుభవిస్తున్న మోదీ ఇంతా నష్టం జరిగితే కనీసం రాలేదు' అని షర్మిల మండిపడ్డారు. 


'ఏడాదికి విజయవాడ రైల్వే డివిజన్ నుంచి రూ.6 వేల కోట్ల ఆదాయం వస్తుంది. రైల్ నీరు ప్లాంట్ విశాఖలోనే ఉంది. కానీ రైల్వే శాఖ వరద బాధితులకు ఒక బాటిల్ కూడా సాయం చేయలేదు. మంచినీళ్లు ఇవ్వమని నేను స్వయంగా కేంద్ర రైల్వేశాఖ మంత్రికి లేఖ రాశా. అయినా కనీస స్పందన లేదు' అని షర్మిల తెలిపారు. 'వరద వల్ల నష్టపోయిన ప్రతి ఇంటికి కనీసం లక్ష రూపాయల సహాయం చేయాలి' అని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల పాఠశాల విద్యార్థులు చందాలు ఇస్తున్న వీడియోను సీఎం చంద్రబాబు అభినందించడంపై షర్మిల తప్పుబట్టారు. 'చిన్న పిల్లల దగ్గర డబ్బులు తీసుకోవడం విడ్డూరం. పిల్లల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం మానేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10 వేల కోట్లు సహాయం తీసుకురండి' షర్మిల హితవు పలికారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.