Ys Sharmila meeting: ఏపీ ముఖమంత్రి వైఎస్ జగన్ సోదరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిల లోటస్ పాండ్ సమావేశం  కలకలం రేపుతోంది. అన్నాచెల్లెళ్ల మద్య విబేధాల సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల వివరణ ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( Ysr congress party ) తెలంగాణలో విస్తరించనుందా..పార్టీ చీలబోతుందా..తెలంగాణ శాఖ ఏర్పడనుందా. జగన్-షర్మిల మద్య విబేధాలున్నాయా. అనేక ప్రశ్నలు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిల ( Ys Sharmila ) ఆత్మీయ సమావేశం దేనికి సంకేతం. ప్రశ్నలకు బలం చేకూరుస్తుందా అనేది సందేహాస్పదంగా మారింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వ సలహాదారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు. 


సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో..


వైఎస్ షర్మిల నిర్ణయం ఆమె వ్యక్తిగతమని చెప్పారు. కోట్లాది మంది ప్రజల అభిమానంతో పుట్టుకొచ్చిన పార్టీ వైఎస్సార్‌సీపీ. పదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చారు. తెలంగాణ ( Telangana ) రాజకీయాలపై వైఎస్‌ జగన్‌ స్పష్టమైన వైఖరితో ఉన్నారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలన్నదే ఆయన ఆలోచన. తెలంగాణలో పార్టీపై చాలాసార్లు చర్చ జరిగింది. ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటాయని వైఎస్‌ జగన్‌ వద్దన్నారు. 


వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ( Ysr congress party ) ఆవిర్భవానికి ఒక ప్రత్యేక సందర్భం ఉంది. కోట్లాది మంది మీద అభిమానంతో వైఎస్‌ జగన్‌ ( Ys jagan ) ఓదార్పుయాత్ర చేశారు. దీన్ని ఓర్చుకోని కాంగ్రెస్‌ పార్టీ బయటకు పంపించే ప్రయత్నం చేసింది. మొదట వైఎస్‌ జగన్‌, విజయమ్మ కాంగ్రెస్‌ను వీడి వచ్చారు. ఆ తర్వాత వైఎస్‌ను అభిమానించే నాయకులు పార్టీలో చేరారు. గత మూడు నెలలుగా ఈ విషయంపై చర్చ జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ తెలంగాణలో ఎందుకు ఉండకూడదు అన్న చర్చ వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశే ముఖ్యమని.. తెలంగాణలో పార్టీ వద్దని సీఎం జగన్‌ సూచించారు. తెలంగాణలోకి వెళ్లాలన్న ఆలోచన పార్టీకి ఏ మాత్రం లేదు. తెలంగాణలో మరో పార్టీ ప్రారంభించాలన్నది షర్మిల ఆలోచనగా కనిపిస్తోంది. ఇవి భిన్నాభిప్రాయాలే కానీ విభేదాలు కావని సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala ramakrishna reddy ) తెలిపారు. రాజకీయ సిద్ధాంతంపై భిన్నాభిప్రాయాలుండవచ్చు గానీ..అన్నా చెల్లెళ్ల మధ్య ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు. 


Also read: Ap first phase panchayat elections polling: తొలిదశ పంచాయితీ ఎన్నికల పోలింగ్, జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook