YS Sharmila: ప్రధాని నరేంద్ర మోదీకి మా అన్న జగన్ కట్టుబానిస: వైఎస్ షర్మిల
YS Sharmila Vs YS Jagan: బీజేపీకి కట్టు బానిసగా సీఎం వైఎస్ జగన్ మారాడాని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా తన సోదరుడు, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
YS Sharmila: 'వైఎస్సార్ కాంగ్రెస్ మనిషి. ముఖ్యమంత్రిగా అద్భుతాలు చేశారు. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్ బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. విభజన హామీలు ఒక్కటి అమలు కాలేదు. ప్రత్యేక హోదా లేదు, కడప స్టీల్ లేదు. ఇవ్వాళ వైఎస్సార్ బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది. బాబాయిని చంపిన హంతుడుకి మళ్లీ సీట్ ఇచ్చారు. హంతకులను కాపాడుతున్నారు. ఇది దురదృష్టం, దుర్మార్గం. ఇది అన్యాయం' అని తెలిపారు.
Also Read: Revanth Vs Bhatti: రేవంత్ రెడ్డి వర్సెస్ భట్టి.. రెండుగా చీలిన తెలంగాణ కాంగ్రెస్?
బద్వేల్ నియోజకవర్గంలోని అమగంపల్లి నుంచి శుక్రవారం షర్మిల ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'హంతకులు మళ్లీ చట్టసభలోకి వెళ్లరాదు. న్యాయం ఒక వైపు, అధికారం ఒక వైపు. అధర్మం వైపు నిలబడ్డ అవినాష్ రెడ్డి కావాలా? న్యాయం వైపు నిలబడ్డ వైఎస్ షర్మిల కావాలా? అని ప్రజలు నిర్ణయం తీసుకోవాలి' అని షర్మిల తెలిపారు. హత్యా రాజకీయాలు చేసే అవినాష్ రెడ్డిని, కాపాడే జగన్ రెడ్డిని ఇద్దరినీ ఓడించాలి అని పిలుపునిచ్చారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలో వస్తేనే రాష్ట్రం అభివృద్ధి అని స్పష్టం చేశారు.
Also Read: Kavitha Bail: ఎమ్మెల్సీ కవితపై ఈడీ సంచలన వ్యాఖ్యలు.. ఇక జైలు బయటకు రానట్టే?
'కడప స్టీల్ ఫ్యాక్టరీని శంకుస్థాపనల ప్రాజెక్ట్ చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ రెండు సార్లు శంకుస్థాపన చేశారు తప్పితే ఉపయోగం లేదు. బీజేపీ దగ్గర జగన్ ఒక బానిసలా మారారు' అని షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ వివేకా కుమార్తె, డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి మాట్లాడారు. 'వైఎస్సార్ అంటే వైఎస్ షర్మిల. వివేకాను చంపిన వాళ్లకు ,షర్మిల కు మధ్య పోటీ అని సునీతారెడ్డి ప్రకటించారు. షర్మిలను ఎంపీ చేయాలని వివేకా చివరి కోరికను నెరవేర్చాలి' అని కోరారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి చేరారు. ఆమెకు షర్మిల కండువా వేసి ఆహ్వానించారు. అనంతరం కృపారాణి మాట్లాడుతూ.. 'జగన్ కోసం ఎంతో కష్టపడ్డా. ఉత్తరాంధ్రలో పార్టీని నిలబెట్టా. అలాంటి నన్ను జగన్ పక్కన పెట్టారు. కష్టపడ్డా గుర్తింపు లేదు' అని ఆవేదన వ్యక్తం చేశారు. 'మాకు వైఎస్సార్ దేవుడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ది సాధ్యం' అని తెలిపారు. సీఎం జగన్ ఒక నియంత, అతడిని గద్దె దించాలని పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook