YS Sharmila: వర్రా రవీంద్రా రెడ్డి అనే సైకో నా పుట్టుకను అవమానించాడు: వైఎస్ షర్మిల
YS Sharmila Welcomes Varra Ravindra Reddy Arrest: తన పుట్టుకను అవమానించిన వర్రా రవీంద్రా రెడ్డి అరెస్ట్ కావడాన్ని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వాగతిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, తన కుటుంబం నికృష్టంగా పోస్టులు చేసిన అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Varra Ravindra Reddy: సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. వీరి అరెస్టులను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించగా.. అతడి సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాత్రం స్వాగతించారు. సరైన పని చేశారంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై.. తన తల్లి, సోదరిపై అత్యంత నీచంగా పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రా రెడ్డి సైకో అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి అరెస్ట్ సమంజసమేనని ప్రకటించారు. ఏపీ పోలీసులు చేపట్టిన అరెస్ట్‌లకు షర్మిల మద్దతు ప్రకటించారు.
Also Read: Ayodhya Temple: అయోధ్యకు ఆంధ్రప్రదేశ్ భారీ కానుక.. కిలో బంగారం.. 13 కిలోల వెండితో ధనస్సు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీంద్రా రెడ్డి అరెస్ట్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల 'ఎక్స్' వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా బృందంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్రా రెడ్డి తీరును మండిపడ్డారు. అతడిని సైకో అంటూ దూషిస్తూ.. అతడికి తగిన శాస్తి జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. గతంలో వర్రా రవీందర్ రెడ్డిపై తనను, తన కుటుంబంపై చేసిన పోస్టులను షర్మిల గుర్తు చేసుకున్నారు.
Also Read: AP House: ఏపీ ప్రజలకు చంద్రబాబు భారీ శుభవార్త.. వచ్చే నెలలో లక్ష ఇళ్లు పంపిణీ
సమాజానికి మంచి చేసే సోషల్ మీడియా వ్యవస్థను కొంతమంది సైకోలు, సైకో పార్టీలతో కలిసి ఉచ్ఛం నీచం లేకుండా భ్రష్టు పట్టించారంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవ సంబంధాలు.. రక్త సంబంధాలు మరిచి మృగాల లెక్క మారారని మండిపడ్డారు. మహిళలు అనే జ్ఞానం లేకుండా ఇంట్లో తల్లి, అక్కా, చెల్లి కూడా సాటి మహిళా అనే ఇంగితం లేకుండా.. ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులతో, వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందారని వివరించారు. సోషల్ సైకోల బాధితుల్లో నేను ఒకరిగా చెప్తున్నా అని తెలిపారు.
అసభ్యకర పోస్టులతో ప్రతిష్ట దెబ్బతినేలా పోస్టులు పెట్టి.. పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠినంగా చర్యలు ఉండాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. తన మీద, తన తల్లి, సోదరి సునీత మీద విచ్చలవిడిగా పోస్టులు పెట్టారని గుర్తు చేశారు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదని అవమానించారని ఆవేదన చెందారు. తన ఇంటి పేరు మార్చి శునకానందం పొందినట్లు తలచుకుని ఆవేదన వ్యక్తం చేశారు. అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రా రెడ్డిపై తాను కూడా పోలీస్ కేసు పెట్టానని.. అలాంటి సైకో అరెస్టును స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు.
అరాచక పోస్టులు చేసే వాళ్లు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాల్సిన అవసరం ఉందని షర్మిల పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడాలంటే భయపడేలా అనునిత్యం చర్యలు కొనసాగాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు షర్మిల విజ్ఞప్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook