YS Sharmila Letter: ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి తోడ్పాటు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని వైసీపీ, టీడీపీకి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సూచించారు. ఉమ్మడి పోరాటానికి రావాలని పార్టీలకతీతంగా ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఇదే కోరుతూ సీఎం జగన్‌కు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. ఏపీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరిని వివరించారు. ఇప్పటికైనా ఏపీ హక్కుల కోసం పోరాడుదామని సూచించారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేసేందుకు కలిసికట్టుగా పోరాడుదామని చెప్పారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: AP DSC Notification 2024: ఎట్టకేలకు ఏపీలో డీఎస్సీ ప్రకటన విడుదల.. పోస్టులు, దరఖాస్తుల వివరాలు ఇవిగో..


లేఖలు రాసిన అనంతరం షర్మిల బుధవారం హైదరాబాదు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా బాపట్లలో జరిగే బహిరంగ సభకు వెళ్లారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులో షర్మిల కాసేపు మీడియాతో మాట్లాడారు. జగన్‌, చంద్రబాబు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం, పాలకపక్షం రెండూ పార్టీలు ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించాలని సూచించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానం చేయాలని ప్రతిపాదన చేశారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అని గుర్తు చేశారు.

Also Read: Sharmila Fever:  అస్వస్థతకు గురైన షర్మిల.. రోడ్‌షో, జిల్లాల పర్యటన వాయిదా?


పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఒక్క సంవత్సరం కూడా ఆంధ్ర గురించి ఆలోచించలేదు అని షర్మిల మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, జగన్‌ మోహన్‌ రెడ్డి వీరిద్దరూ రాష్ట్రం గురించి ఆలోచించలేదని విమర్శించారు. స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టిట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారైనా అసెంబ్లీ సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర హక్కుల తీర్మానాన్ని ప్రజల కోసం ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు విషయంలో బీజేపీ ఎందుకు ద్రోహం చేసిందో అసెంబ్లీలో చర్చించి తీర్మానాన్ని ఆమోదించాలని వివరించారు. ఆ తీర్మానం రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. 


రాష్ట్ర ప్రయోజనాలు పక్కనపెట్టి ఒకరు కుర్చీ కాపాడుకోవడం కోసం, మరొకరు కుర్చీ ఎలా సంపాదించాలనే పనిలో ఉన్నారని వైఎస్‌ షర్మిల తెలిపారు. జగన్‌, చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలపై పట్టింపే లేదని విమర్శించారు. బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలను ఇంటికి పంపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమని స్పష్టం చేశారు. తన భద్రత విషయమై షర్మిల స్పందిస్తూ.. 'రాష్ట్ర ప్రభుత్వం నాకు భద్రత కల్పించాల్సి ఉంది. కానీ అవేవీ పట్టించుకోకుండా మహిళా అని చూడకుండా, మేం అడిగినా కూడా మాకు భద్రతా కల్పించడం లేదు అంటే మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా' అని ప్రశ్నించారు. 'ప్రజాస్వామ్య దేశం అనేది అసలు మీకు గుర్తుందా' అని నిలదీశారు. 'మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా అని అడగలేదు. ప్రతిపక్షాలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా. భద్రత కల్పించకపోవడం వెనుక మా చెడు కోరుకుంటున్నారనే కదా అర్థం. ఇదెక్కడి ప్రజాస్వామ్యం' అని పేర్కొన్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook