AP DSC Notification 2024: ఎట్టకేలకు ఏపీలో డీఎస్సీ ప్రకటన విడుదల.. పోస్టులు, దరఖాస్తుల వివరాలు ఇవిగో..

AP DSC Notification 2024: ఏళ్లుగా ఊరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయుల ఉద్యోగ ప్రకటన ఎట్టకేలకు విడుదలైంది. ఏపీ ప్రభుత్వం డీఎస్సీ ప్రకటనను విడుదల చేసింది. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి తాజాగా ఉద్యోగా ప్రకటన విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Last Updated : Feb 7, 2024, 05:11 PM IST
AP DSC Notification 2024: ఎట్టకేలకు ఏపీలో డీఎస్సీ ప్రకటన విడుదల.. పోస్టులు, దరఖాస్తుల వివరాలు ఇవిగో..

AP DSC 2024 Notification: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది. మెగా డీఎస్సీ ప్రకటనను విడుదల చేస్తున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. మొత్తం 6,100 ఉపాధ్యాయల పోస్టుల భర్తీకి బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఈనెల 12వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని.. ఏప్రిల్‌ 7వ తేదీన ఫలితాలు ప్రకటించనున్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఈ ఉద్యోగ ప్రకటన విడుదల కావడం గమనార్హం.

Also Read: Vishnu Idol: కృష్ణా నదిలో ప్రత్యక్షమైన దేవతా మూర్తులు.. అయోధ్య రాముడి రూపంలో శ్రీమహావిష్ణువు, శివలింగం

ఉద్యోగ ప్రకటన వివరాలు
డీఎస్సీ 2024 ప్రకటన కింద మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తారు. ఏడు మేనేజ్‌మెంట్ల పరిధిలో ఈ పోస్టులు భర్తీ కానున్నాయి. వీటిలో 2,299 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 2,280 ఎస్‌జీటీ పోస్టులు, 1,264 టీజీటీ పోస్టులు, 215 పోస్టులు, ప్రిన్సిపల్స్‌ 42 ఉన్నాయి.

Also Read: Bharath Rice: రేపటి నుంచే 'భారత్‌ రైస్‌'.. రూ.29కే బియ్యం ఎక్కడ తీసుకోవాలో తెలుసా?

తేదీలు
దరఖాస్తులు ప్రారంభం: 12 ఫిబ్రవరి 2024
దరఖాస్తులకు ఆఖరి తేది: 22 ఫిబ్రవరి 2024
హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌: 23 ఫిబ్రవరి 2024
పరీక్షలు: 15 మార్చి నుంచి 30వ తేదీ వరకు రెండు సెషన్స్‌లో నిర్వహణ
కీ విడుదల: 1 ఏప్రిల్‌ 2024
ఫైనల్‌ కీ విడుదల: 2 ఏప్రిల్‌ 2024
తుది ఫలితాలు: 7 ఏప్రిల్‌ 2024
దరఖాస్తులు ఎక్కడ: https://cse.ap.gov.in/loginhome

టెట్‌ ప్రకటన
డీఎస్సీకి అనుబంధంగా ప్రకటించిన టెట్‌ను ఇటీవల ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈనెల 8వ తేదీ నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 23 నుంచి హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ అందుబాటులో ఉంచుతారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9వ తేదీ వరకు రెండు సెషన్స్‌లో టెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫైనల్‌ కీ మార్చి 13వ తేదీన విడుదల చేసి అదే నెల 14వ తేదీన టెట్‌ తుది ఫలితాలు విడుదల కానున్నాయి.

విద్య మా తొలి ప్రాధాన్యం
'సీఎం జగన్‌ పేదల విద్య కోసం విశేషంగా కృషి చేస్తున్నాం. నాలుగేళ్లలో మా ప్రభుత్వం రూ.73 వేల కోట్లు  విద్యకోసం ఖర్చు చేశాం. ప్రపంచ స్థాయి విద్యను అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. 47 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రపంచ స్థాయి విద్యను అందిస్తున్నాం. మారుతున్న విద్యా బోధనకు తగినట్లు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నాం.' అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News