YS Vijayamma Open Letter: కన్న కొడుకు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై అతడి మాతృమూర్తి సంచలన విషయాలు చెబుతూ అభిమానులతో లేఖ పంచుకుంది. వైఎస్సార్‌ అభిమానులకు రాసిన లేఖ బయటకు వచ్చింది. ఈ లేఖలో తన కుటుంబంలో జరుగుతున్న ఆస్తుల వివాదాన్ని వివరించారు. తమ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు తన మనసుకు చాలా బాధేస్తోందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అంటూ బాధపడ్డారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Lokesh: ఆంధ్రప్రదేశ్‌కు ఏపీకి మైక్రోసాఫ్ట్‌ కంపెనీ?.. ఐటీ శాఖ మంత్రిగా లోకేశ్‌ తొలి విజయం


వైఎస్సార్‌ బతికి ఉన్నప్పుడు తన పిల్లలతో కుటుంబం సంతోషంగా ఉందని గుర్తు చేసుకున్నారు. తన కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారని.. అబద్ధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదని హితబోధ పలికారు. తన పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడొద్దని విజ్ఞప్తి చేశారు. తన బిడ్డల సమస్యలకు తాను నమ్ముకున్న దేవుడు పరిష్కారం ఇస్తాడని విజయమ్మ లేఖలో ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: Pawan Kalyan: మనతోపాటు వన్య ప్రాణులకు బతుకినివ్వాలి.. డిప్యూటీ సీఎం పవన్ పిలుపు


కాగా ఇప్పటికే తమ కుటుంబంలో ఆస్తి తగాదాలపై వైఎస్‌ జగన్‌ సోదరి, ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కూడా సంచలన లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మీడియా ముందు మాట్లాడి కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబంలో జరుగుతున్న వివాదం రాజకీయంగా కూడా తీవ్రంగా దుమారం రేపుతోంది. అంతేకాకుండా వైఎస్సార్‌ కుటుంబం పరువు పోతుండడంతో విజయమ్మ రంగంలోకి దిగారు.


'ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు నా మనసుకి చాలా చాలా బాధేస్తోంది. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావడం లేదు. నేను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా జరగకూడనివి అన్ని నా కళ్లముందే జరిగిపోతున్నాయి' అని విజయమ్మ ఆవేదనకు లోనయ్యారు. ఇలాంటివి ఇకపై కొనసాగొద్దు. నా పిల్లలిద్ధరికీ కాదు రాష్ట్రానికి కూడా మంచిది కాదు. దయచేసి ఈ కుటుంబం గురించి, నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని కోరుతున్నా' అని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వైవీ సుబ్బారెడ్డి, విజయ సాయి రెడ్డితోపాటు మరికొందరు చేసిన వ్యాఖ్యలను విజయమ్మ తప్పుబట్టారు.


తనకు జగన్‌, షర్మిల ఇద్దరు సమానమని వైఎస్‌ విజయమ్మ స్పష్టం చేశారు. 'ఆస్తులు కూడా ఇద్దరికీ సమానం అనేది నిజం. నలుగురు చిన్నబిడ్డలకు సమానంగా ఉండాలన్న వైఎస్సార్‌ ఆజ్ఞ నిజం. ఆస్తులు వృద్ధిలోకి తేవడంలో జగన్ కష్టం ఉందనేది నిజం. కానీ అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అన్నది నిజం. జగన్ బాధ్యత గల కొడుకుగా కుటుంబ ఆస్తులను సంరక్షించాలన్నది కూడా నిజం' అని విజయమ్మ వివరించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.