YS Vivekananda Reddy Murder Case: మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో మరొక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు వైఎస్ వివేకాకు అత్యంత సమీప బంధువులైన వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిలను ప్రశ్నించిన సీబీఐ.. తాజాగా వైఎస్ వివేకానంద రెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించింది. రాజశేఖర్ రెడ్డికి తొలుత సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చిన సీబీఐ.. శనివారం విచారణ కోసం హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీబీఐ నోటీసులు అందుకున్న రాజశేఖర్ రెడ్డి.. సీబీఐ అధికారుల ఆదేశాల మేరకు శనివారం హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరయ్యారు. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్‌ల విచారణ ముగిసిన అనంతరం సీబీఐ అధికారులు రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖపై రాజశేఖర్ రెడ్డి నుంచి సీబీఐ అధికారులు పలు వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. లేఖను ఎందుకు దాచిపెట్టమని చెప్పాల్సి వచ్చిందని అడిగి తెలుసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలం నమోదు చేసుకున్న అనంతరం ఆయన్ను ఇంటికి పంపించేశారు.


వైఎస్ వివేకానంద రెడ్డి రెండో భార్యగా చెప్పుకుంటున్న షమీమ్ రెండు రోజుల క్రితమే సీబీఐ అధికారులకు తన వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా షమీమ్ మాట్లాడుతూ.. వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత భర్త అయిన రాజశేఖర్ రెడ్డిపై, ఆయన సోదరుడిపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. 


ఇది కూడా చదవండి : Viveka Murder Case Latest Update: డీఎన్‌ఏ టెస్టుకు రెడీ.. అప్పుడే నన్ను పెళ్లి చేసుకున్నారు: వివేకా రెండో భార్య సంచలన స్టేట్‌మెంట్ 


సునీత భర్త రాజశేఖర్ రెడ్డి, ఆయన సోదరుడు తనను చాలాసార్లు బెదిరించినట్లు షమీమ్ సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. షమీమ్ వాంగ్మూలం తీసుకున్న తరువాతే సీబీఐ అధికారులు రాజశేఖర్ రెడ్డిని విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. షమీమ్ చెప్పిన వివరాల ఆధారంగానే సీబీఐ అధికారులు రాజశేఖర్ రెడ్డిపై కన్నేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా రాబోయే రోజుల్లో రాజశేఖర్ రెడ్డి సోదరుడిని సైతం విచారణకు పిలిపించి ఆయన వాంగ్మూలం కూడా తీసుకునే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుంటే, ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డిని, ఉదయ్‌లను సీబీఐ అధికారులు రేపు మరోసారి విచారించనున్నారని తెలుస్తోంది.


ఇది కూడా చదవండి : YS Vivekananda Reddy's Watchman Ranganna: వాళ్లు లోపలికి వెళ్లడం చూశానన్న వాచ్‌మన్ రంగన్న


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK