మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇటీవల కొద్దికాలంగా చర్చనీయాంశమౌతోంది. ఈ కేసులో ఇప్పటి వరకూ ఆరోపణలు ఎదుర్కొన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సైతం సీబీఐ ఇటీవలే విచారించడం దీనికి కారణం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు తుది విచారణకు చేరుతోంది. కేసులో కీలకమైన ఐదుగురు నిందితులు ఈ నెల 10వ తేదీన సీబీఐ కోర్టులో హాజరు కావల్సి ఉంది. ఐదుగురు నిందితులు ఒకేసారి కోర్టుకు హాజరుకానుండటం ఇదే తొలిసారి. ఇప్పటికే కడప సెంట్రల్ జైలులో ఉన్న ముగ్గురు నిితులకు ప్రొటక్షన్ వారెంట్ బెయిల్‌పై ఉన్న మరో ఇద్దరికి సమన్లు అందాయి. రిమాండ్ ఖైదీలుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలతో పాటు బెయిల్‌పై ఉన్న ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరిలు సీబీఐ కోర్టులో హాజరు కావల్సి ఉంది. 


వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేసిన తరువాత కేసు విచారణ ముమ్మరమైంది. 


Also read: Vanjangi Hills: ప్రకృతి చేసిన అద్భుతం.. వంజంగి అందం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook