YS Vivekananda Reddy's death case: పులివెందుల: వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని వివేకాకు అత్యంత సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి స్పష్టంచేశారు. తాను చంపుతానని బెదిరించానంటూ వివేకానంద రెడ్డి వాచ్‌మెన్‌ రంగయ్య (Watchman Rangaiah) ఆరోపించిన నేపథ్యంలో ఎర్ర గంగిరెడ్డిపై (Erra Gangi Reddy) మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి. దీంతో రంగయ్య తనపై చేసిన ఆరోపణలపై గంగిరెడ్డి స్పందిస్తూ.. అసలు వాచ్‌మెన్ రంగయ్యతో తనకు పరిచయమే లేదని అన్నారు. రంగయ్యను అసలు చూడనేలేదని, అతడితో మాట్లాడనేలేదన్న గంగిరెడ్డి.. రంగయ్య మద్యం మత్తులో మాట్లాడుతున్నాడని అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివేకానంద రెడ్డి తనకు దైవంతో సమానమని, ఆయన్ను ఎదిరించే ధైర్యం కానీ లేదా ఆయనకు అన్యాయం చేసే ఉద్దేశం కానీ తనకు లేవని అన్నారు. ఇప్పటి వరకు సీబీఐ (CBI) వాళ్లు విచారణకు పిలిచిన ప్రతిసారీ వెళ్లాను. వివేకా మరణవార్త ఆయన బావమరిది చెప్తే కానీ తనకు తెలియదని చెప్పిన గంగిరెడ్డి.. సంఘటనా స్థలానికి తాము వెళ్లడానికంటే ముందే పోలీసులు అక్కడికి చేరుకున్నారని తెలిపారు. 


Also read: Vizag Steel Plant Issue: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యమం ఇకపై మరింత ఉధృతం


వైఎస్ వివేక హత్య కేసు విచారణలో (YS Viveka murder case) భాగంగా సీబీఐ ఎదుట హాజరై తిరిగి పులివెందులకు (Pulivendula) వచ్చిన రంగయ్య.. గంగిరెడ్డి తనను బెదిరించాడంటూ చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎర్ర గంగిరెడ్డి ఈ వివరణ ఇచ్చారు.


Also read : AP Governor: కరోనా నియంత్రణలో ఏపీపై ప్రశంసలు కురిపించిన గవర్నర్ హరిచందన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook