వైఎస్‌ వివేకా హత్య కేసులో ఇద్దరికి నార్కో అనాలసిస్‌ పరీక్షలు

వైఎస్‌ వివేకా హత్య కేసులో ఇద్దరికి నార్కో అనాలసిస్‌ పరీక్షలు 

Updated: Aug 25, 2019, 11:39 PM IST
వైఎస్‌ వివేకా హత్య కేసులో ఇద్దరికి నార్కో అనాలసిస్‌ పరీక్షలు
File photo

పులివెందుల: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితులుగా ఉన్న వివేకా సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, వాచ్‌మన్‌ రంగయ్య, కసనూరు పరమేశ్వర్‌ రెడ్డి, దిద్దెకుంట శేఖర్‌ రెడ్డిలను 20 రోజుల క్రితమే సిట్‌ బృందం పులివెందుల కోర్టు అనుమతితో నార్కో అనాలసిస్‌ పరీక్షల నిమిత్తం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న ల్యాబ్‌కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ఆ నలుగురిలో తాజాగా ఇద్దరికి నార్కో అనాలసిస్‌ పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో నార్కో అనాలసిస్ పరీక్షలు పూర్తి చేసుకున్న వాచ్‌మన్‌ రంగయ్యను, ఎర్ర గంగి రెడ్డిని కడప పోలీసులు తిరిగి తీసుకొచ్చి శనివారం పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న కసనూరు పరమేశ్వర్‌ రెడ్డి, దిద్దెకుంట శేఖర్‌ రెడ్డిలకు కూడా నార్కో పరీక్షలు పూర్తయిన తర్వాతే ఈ నలుగురు సిట్ అధికారుల విచారణలో ఏం వెల్లడించారనే విషయాలు తెలిసే అవకాశం ఉంది. 

గత ఐదు నెలలుగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు సిట్‌ బృందం దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే.