TS High Court: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు తీరు ప్రశ్నార్ధకంగా మారుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటీషన్‌పై విచారణ సందర్బంగా దాఖలు చేసిన అదనపు అఫిడవిట్ సంచలనమైంది. వివేకా హత్య సమాచారం ముందే తెలుసంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేరు ప్రస్తావించింది సీబీఐ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటీషన్‌పై తెలంగాణ హైకోర్టులో నిన్నట్నిచి వాదనలు కొనసాగుతున్నాయి. నిన్నంతా వాడివేడిగా ఇరుపక్షాల వాదనలు జరిగాయి. వివేకా హత్యోదంతం గురించి తనకు తెలియదని అంతా చెప్పాలని తెలంగాణ హైకోర్టు కోరగా అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది అంతా వివరించారు. ఇది చూసి తమకూ అంతే సమయం కేటాయించాలని కోరడంతో సునీత తరపు న్యాయవాదిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరిగి ఇవాళ్టికి కేసు వాయిదా పడటంతో మళ్లీ వాదనలు ప్రారంభమయ్యాయి. 


ఈ సందర్భంగా వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపింది సీబీఐ. ఎన్నిసార్లు నోటీసులిచ్చినా అవినాష్ రెడ్డి ఏతో ఒక సాకుతో తప్పించుకుంటున్నారని సీబీఐ పేర్కొంది. వైఎస్ వివేకా హత్యకు నెలరోజుల ముందే కుట్ర జరిగిందని..దీనివెనుక రాజకీయ. కారణముందని సీబీఐ చెప్పింది.


అయితే సీబీఐ వాదనపై తెలంగాణ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. లోక్‌సభ అభ్యర్ధిగా వైఎస్ అవినాష్ రెడ్డిని అనధికారికంగా ముందే ప్రకటించారని స్టేట్‌మెంట్ చెబుతోంది, అందరూ ఆయన అభ్యర్ధిత్వాన్ని సమర్ధిస్తున్నట్టు స్టేట్‌మెంట్స్ ఉన్నాయి కదా అని కోర్టు సీబీఐని ప్రశ్నించింది. రాజకీయంగా అవినాష్ రెడ్డి బలవంతుడని మీరే చెబుతున్నప్పుడు వివేకాను చంపాల్సిన అవసరం ఏముందని సీబీఐ అడిగింది. మరోవైపు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారు, వారి నుంచి ఏమైనా సమాచారం రాబట్టారా అని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. వివేకా హత్య జరిగినప్పుడు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారని ఎలా చెబుతున్నారు గదిలో రక్తం తుడిచేస్తే అది ట్యాంపరింగ్ ఎందుకౌతుంది, శరీరంపై గాయాలుంటాయి కదా అని తెలంగా హైకోర్టు సీబీఐని ప్రశ్నించింది. అయితే సీబీఐ మాత్రం విచారణకు సహకరించడం లేదనే తెలిపింది. 


Also read: Viveka Murder Case: వివేకా హత్యకేసులో సంచలన పరిణామం, జగన్‌కు ముందే తెలుసంటున్న సీబీఐ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook