వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రమంతటా ఘనంగా జరుగుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేశారు. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ రోల్ మోడల్ అని..ఎప్పటికీ ఓటమి ఉండదని పార్టీ నేతలు స్బష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ్టికి 12 వసంతాలు పూర్తి చేసుకుని 13వ ఏట అడుగెట్టింది. 2009లో కాంగ్రెస్ నుంచి బయటికొచ్చిన వైఎస్ జగన్..కొద్దికాలానికి 2011 మార్చ్ 12వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ స్థాపించారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో 67 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా నిలిచి..2019 ఎన్నికల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేశారు. 175 సీట్లలో 151 సీట్లు గెల్చుకుని తానేంటో రుజువు చేశారు. ఈసారి అంటే 2024 ఎన్నికలకు వైనాట్ 175 అంటున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.


విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లు


మహానేత అమలు చేసిన పథకాలను కొనసాగిస్తూ అదే బాటలో ముందుకెళ్లాలనే ధృఢ సంకల్పంతో జగన్ గారు స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు 13 ఏళ్లు. లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా అంతకుమించి నాలుగడుగులు ముందుకు వేయడం కన్పిస్తోంది.


ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, ఓసీ నిరుపేదల పార్టీ. ఈ పార్టీ సామాజిక న్యాయానికి, మహిళ, విద్య, రాజకీయ, ఆర్ధిక సాధికారతకు దేశంలోనే చుక్కాని.


ఇది రైతన్నలు, పల్లెలు, నిరుపేదల్ని ప్రేమించే నాయకుడి పార్టీ. ఇది ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి 98.5 శాతం వాగ్దానాల్ని అమలు చేసిన నాయకుడి పార్టీ.


ఈ పార్టీ గ్రామ స్వరాజ్యం నుంచి జిల్లాల పునర్విభజన వరకూ పరిపాలనా సంస్కరణలు చేసిన నాయకుడి పార్టీ. ప్రాంతాలకు సమన్యాయం కోసం వికేంద్రీకరణ సిద్ధాంతం ఆచరిస్తున్న పార్టీ. తెలుగునాట మరో పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతున్న దార్శనికుడి పార్టీ.


జగన్ గారి నాయకత్వానికి అర్ధం..మారిన గ్రామం, మారుతున్న సామాజిక చిత్రం, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి అండ. ఆయన నేటి తరానికి ఆలంబన, భావితరానికి భరోసా.


వరుస ట్వీట్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించిన విజయసాయిరెడ్డి చివరిగా We are Always proud of you sir అని ముగించారు. విద్యా, వైద్య రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా సంస్కరణలు తీసుకొచ్చి..అధికారాన్ని ఓ బాధ్యతగా భావించి ముఖ్యమంత్రి జగన్ పాలన కొనసాగిస్తున్నారని సజ్జల రామకృష్షారెడ్డి తెలిపారు.


Also read: Ys Jagan to Vizag: విశాఖ నుంచే పరిపాలన, అంతా సిద్ధం, ఎప్పట్నించంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook