Kakinada New Mayor: ఆంధ్రప్రదేశ్ కాకినాడ మేయర్ ఎంపిక ప్రక్రియ ముగిసింది. అధికార పార్టీ ఖాతాలో మరో మేయర్ పదవి దక్కింది. అసమ్మతి పరిణామాల నేపధ్యంలో మేయర్ సుంకర పావని పదవీచ్యుతురాలవడంతో కొత్త మేయర్‌ను ఇవాళ ఎన్నుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా ముఖ్యపట్టణం కాకినాడ కార్పొరేషన్(Kakinada Corporation)వ్యవహారం రాష్ట్రమంతా సంచలనమైంది. మేయర్ పదవి తెలుగుదేశం నుంచి అధికారపార్టీకు మారింది. కాకినాడ కార్పొరేషన్ పీఠాన్ని అధిరోహించిన తెలుగుదేశం పార్టీ నేత సుంకర పావనిపై ఇటీవల కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం(No Confidence Motion)ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం భారీ మెజార్టీతో గెలవడంతో మేయర్ సుంకర పావని పదవీచ్యుతులయ్యారు. నాలుగేళ్ల మేయర్ పదవి కోల్పోయింది. నియంతృత్వ విధానాలతో అసంతృప్తి మూటగట్టుకుని కార్పొరేటర్ల విశ్వాసం కోల్పోయారు మేయర్ సుంకర పావని. ఈ మేరకు ఆమెను మేయర్‌ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. జీవోఎంఎస్‌ నెంబర్‌ 129 ద్వారా ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్ట్‌ 1955లోని సెక్షన్‌ 91/ఎ(6) ద్వారా ఉత్తర్వులిచ్చారు. ఆమెతోపాటు డిప్యూటీ మేయర్‌ కాలా సత్తిబాబును కూడా పదవి నుంచి తొలగించారు.


కాకినాడ మేయర్‌గా కొత్త మేయర్(Kakinada New Mayor), డిప్యూటీ మేయర్‌ను ఇవాళ ఎన్నుకున్నారు. కాకినాడ మేయర్‌గా సుంకర శివప్రసన్న, డిప్యూటీ మేయర్‌గా మీసాల ఉదయకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేయర్‌ ఎన్నికకు టీడీపీ కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. కాకినాడ నగర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని కొత్త మేయర్ సుంకర శివప్రసన్న( Sunkara Siva prasanna)తెలిపారు. ఇది కార్పొరేటర్ల విజయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్(Ap cm ys jagan)ఆలోచన మేరకు మేయర్‌గా ఒక మహిళను, బీసీలకు రెండు డిప్యూటీ మేయర్ పదవుల్ని ఇచ్చినట్టు చెప్పారు. 


Also read: Chandrababu: రాష్ట్రపతిని కలిసిన చంద్రబాబు బృందం...ఏపీలోని పరిస్థితులపై ఫిర్యాదు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook