AP SEC Issue: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు ప్రభుత్వ పెద్దలకు ఘర్షణ వాతావరణ నెలకొంది. మంత్రి పెద్దిరెడ్డిపై తాజాగా ఎస్ఈసీ విధించిన ఆంక్షలతో వివాదం మరోసారి రాజుకుంది. మాటల దాడి తీవ్రమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh )ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Sec Nimmagadda Ramesh Kumar )‌పై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయితీ ఎన్నికలు ముగిసే వరకూ నివాసానికే పరిమితం చేయాలని..మీడియాతో సైతం మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ( Dgp Gowtham Sawang )‌కు ఉత్తర్వులు జారీ చేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.  మంత్రి పెద్దిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంతోపాటు చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఎస్‌ఈసీ లేఖలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 21 తేదీ వరకు పెద్దిరెడ్డి తన ఇంటి నుంచి బయటకు రాకుండా నిలువరించాలని డీజీపీకి సూచించడంతో విమర్శల ధాటి పెరిగింది. వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ( Ambati Rambabu ) దీనిపై స్పందించారు.


ఎస్ఈసీ ( SEC )చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీకి మేలు చేసేలా నిమ్మగడ్డ పని చేస్తున్నారని..ప్రభుత్వంతో నిమ్మగడ్డ ఎప్పుడూ సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు. సెక్యూరిటీ సర్టిఫికెట్‌ లేకుండానే ఈ-వాచ్‌ యాప్ ( E watch app )తీసుకొచ్చారని అంబటి తెలిపారు. మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు ( Chandrababu )పై ఎస్‌ఈసీ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Minister Peddireddy )పై ఆంక్షలు సరికావని ఆయన అన్నారు. మంత్రిని కట్టడి చేసే అధికారం నిమ్మగడ్డకు లేదని ఆయన తేల్చి చెప్పారు. నిమ్మగడ్డ కూడా చట్టానికి లోబడే పనిచేయాలని హితవు పలికారు. గీత దాటితే నిమ్మగడ్డకు రాజ్యాంగ రక్షణ ఉండదని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా పనిచేసే అధికారులపై చర్యలు తప్పవని అంబటి రాంబాబు గుర్తుచేశారు.


మరోవైపు రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి సైతం నిమ్మగడ్డపై ఆరోపణలు గుప్పించారు. నిమ్మగడ్డ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని..అధికారులు కూడా బెదిరిస్తున్నారని మిధున్ రెడ్డి ఆరోపించారు. ఎస్ఈసీపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ప్రజా ప్రతినిధుల హక్కులను నిమ్మగడ్డ కాలరాస్తున్నారని మండిపడ్డారు. 


Also read: Ap Sec issue: ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డకు జైలు శిక్ష తప్పదు: మంత్రి పెద్దిరెడ్డి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook