Ap Municipal Elections: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో విజయం అధికారపార్టీలో ఉత్సాహం రేపుతోంది. రాష్ట్రంలో జరగగాల్సిన స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల కమీషనర్ నిర్ణయానికి రెడీ అంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నిక ( Ap Panchayat Elections )ల్లో ఇప్పటికే రెండు దశల పోలింగ్ ముగిసింది. మరో రెండు విడతల పోలింగ్ మిగిలుంది. తొలి రెండు దశల పంచాయితీ ఎన్నికల్లో అధికార పార్టీ హవా స్పష్టంగా కన్పించింది. తొలి దశలో 3 వేల 244 పంచాయితీలు, రెండవ దశలో 3 వేల 328 పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. రెండవ దశలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Ysr congress party )మద్దతుదారులు 2 వేల 639 పంచాయితీల్లోనూ, తెలుగుదేశం ( Telugu desam )మద్దతుదారులు 536 పంచాయితీల్లోనూ బీజేపీ 6, జనసేన 36 పంచాయితీల్లో విజయం సాధించగా..ఇతరులు 108 స్థానాల్లో గెలిచారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారనడానికి నిదర్శనం పంచాయితీ ఎన్నికల ఫలితాలేనని మంత్రి స్పష్టం చేశారు. పంచాయితీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనం స్పష్టమైందన్నారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాల వల్లనే వైసీపీ మద్దతుదారులు మెజార్టీ స్థానాల్లో గెలిచారని మరో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. 


రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ( Minister Botsa satyanarayana )వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ( SEC ) ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా సరే..ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలొచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. తెలుగుదేశం పార్టీ అంకెల గారడీ చేస్తోందని మంత్రులు విమర్శించారు. మాయ, మోసం, దగాలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటోందన్నారు. 


Also read: Panchayat second phase: టీడీపీ సీనియర్ నేతల ఇలాకాలో పరాభవం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook