Ysrcp 3rd list: ఏపీ ఎన్నికలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సంసిద్ధమైంది. వైనాట్ 175 లక్ష్యంగా భారీగా అభ్యర్ధుల్ని మార్చేస్తోంది. పూర్తి స్థాయిలో మార్పులతో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల జాబితాలు విడుదలవుతున్నాయి. ఇవాళ మూడో జాబితా వెలువడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెండు జాబితాల్లో 38 మందిని వివిధ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలుగా నియమించింది. తొలి జాబితాలో 11 మంది, రెండో జాబితాలో 27 మంది చేర్చింది. ఈ రెండు జాబితాలతో భారీగా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు మార్పు, కొందరికి ఉద్వాసన, మరి కొందరిని ఎంపీ నుంచి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్యే నుంచి ఎంపీకు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో సర్వేలు, సామాజిక సమీకరణాలు, బలాబలాలు, ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధులు, గెలుపు గుర్రాల్ని పరిగణలో తీసుకుని భారీగా మార్పులు చేస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్. ఇందులో భాగంగానే ఇవాళ 21 మందితో మూడో జాబితా విడుదలైంది. ఇందులో ఆరు పార్లమెంట్ స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాల ఇన్‌ఛార్జి‌ల పేర్లున్నాయి. 


మూడో జాబితాలో ప్రధానంగా శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్ని ఫోకస్ చేశారు. ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ మూడో జాబితాను సిద్ధం చేశారు. మూడో జాబితాలో ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నానికి స్థానం కల్పించారు. విజయవాడ పార్లమెంట్ ఇన్‌ఛార్జిగా నియమించారు. ఇక విశాఖపట్నం పార్లమెంట్ ఇన్‌ఛార్జిగా మంత్రి బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీకు బాధ్యతలు అప్పగించారు. 


శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి పేరాడ తిలక్
విశాఖపట్నం పార్లమెంట్ స్థానానికి బొత్స ఝాన్సీ
ఏలూరు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా కారుమూురి సునీల్ కుమార్ యాదవ్
విజయవాడ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా కేశినేని నాని
తిరుపతి పార్లమెంట్ ఇన్‌చార్జిగా కోనేటి ఆదిమూలం
కర్నూలు పార్లమెంట్ ఇన్‌ఛార్జిగా గుమ్మనూరి జయరాం


ఇక అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా పరిశీలిస్తే..


ఇచ్చాపురం ఇన్‌చార్జ్‌గా పిరియ విజయ
టెక్కలి ఇన్‌ఛార్జ్‌గా దువ్వాడ శ్రీనివాస్
చింతలపూడి (ఎస్సీ) ఇన్‌ఛార్జ్‌గా కంభం విజయరాజు
రాయదుర్గం ఇన్‌ఛార్జిగా మెట్టు గోవిందరెడ్డి
దర్శి ఇన్‌ఛార్జిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
పూతలపట్టు ( ఎస్సీ) ఇన్‌ఛార్జిగా మూతిరేవుల సునీల్ కుమార్
చిత్తూరు ఇన్‌ఛార్జిగా విజయానంద్ రెడ్డి
మదనపల్లె ఇన్‌ఛార్జిగా నిసార్ అహ్మద్
రాజంపేట ఇన్‌ఛార్జిగా ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి
ఆలూరు ఇన్‌ఛార్జ్‌గా బూసినే విరూపాక్షి
కోడుమూరు ( ఎస్సీ) ఇన్‌చార్జిగా  డాక్టర్ సతీష్
గూడూరు శ్( ఎస్సీ) ఇన్‌చార్జిగా మేరిగ మురళి
పెనమలూరు ఇన్‌ఛార్జిగా జోగి రమేశ్
పెడన ఇన్‌ఛార్జిగా ఉప్పాల రాము


Also read: Mudragada vs Jyothula Nehru: ముద్రగడతో జ్యోతుల నెహ్రూ భేటీ వెనుక మతలబు ఏంటి, అసలేం జరిగింది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook