First phase panchayat elections 2021: ఆంధ్రప్రదేశ్ లో తొలిదశ పంచాయితీ పోరు ముగిసింది. అధికార పార్టీ హవా స్పష్టంగా కన్పించింది. తొలిదశలో 82 శాతం పంచాయితీల్లో వైసీపీ మద్దతుదారులే విజయం సాధించారు. ఓటర్లకు మంత్రి బొత్స సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ( Welfare schemes ) గ్రామీణ ప్రజలు పట్టం కట్టారని..అందుకు నిదర్శనమే పంచాయితీ ఎన్నికలని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. తొలిదశ పంచాయితీ ఎన్నిక ( First phase panchayat elections )ల్లో 82 శాతం వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్దులే విజయం సాధించారని ఆయన చెప్పారు. తొలిదశలో జరిగిన 2 వేల 637 పంచాయితీ ఎన్నికల్లో దాదాపు 2 వేల పంచాయితీలను వైసీపీ సానుభూతిపరులు కైవసం చేసుకున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ ( Minister Botsa Satyanarayana ) తెలిపారు. ఈ సందర్భంగా ఓట్లేసి గెలిపించిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిగూడెంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 


ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu naidu )పై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నోరు విప్పితే చాలు అన్నీ అబద్దాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పేదంతా అంకెల గారడీ తప్ప మరేదీ కాదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ ( Volunteer system ) తీసుకొస్తే..ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. సేవా దృక్ఫథంతో పనిచేసేవారికి 5 వేల గౌరవ వేతనం ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ ( Ap cm ys jagan ) ముందే చెప్పారన్నారు. ప్రతి ఇంటికీ మేలు చేయాలనే ఉద్దేశ్యంతో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినట్టు మంత్రి చెప్పారు. సమాజంలో వాలంటీర్లకు మంచి గౌరవముందని..దాన్ని పాడుచేసుకోవద్దని సూచించారు. ఎవరో చెప్పిన మాటలు విని పక్కదారి పట్టవద్దని వాలంటీర్లకు విజ్ఞప్తి చేశారు. 


Also read: Supreme court: ఏపీ ప్రభుత్వానికి ఊరట, జస్టిస్ రాకేశ్ కుమార్ ఆదేశాలపై స్టే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదంరాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook