Ys Jagan Fired: ఏపీలో ప్రశ్నించే స్వరం ఉండకూడదనే ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఎక్కడికక్కడ అణగదొక్కే చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఇవాళ తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సూపర్ సిక్స్ అంటూ అన్ని వర్గాల్ని ప్రభుత్వం మోసం చేసిందన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక అభివృద్ధి ఎటూ లేదు..సంక్షేమం కూడా అటకెక్కిందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మూడు విడతలుగా ఇవ్వాల్సిన విద్యా దీవెన ఇవ్వలేదని, ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఆర్బీకే కేంద్రాలను గాలికొదిలేశారని, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ మూలనపడేశారని ఆరోపించారు. ఇక శాంతి భద్రతలయితే రాష్ట్రంలో అధ్వాన్న స్థితిలో ఉందన్నారు. మహిళలపై అఘాయిత్యాలు, అకృత్యాలు పెరిగిపోయాయని. గత 5 నెలల వ్యవధిలో 91 ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. వీరిలో ఏడుగురు బాధితులు చనిపోవడం బాధాకరమన్నారు. 


అకృత్వాల్ని అరికట్టాల్సిన ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. తెనాలిలో ఓ అమ్మాయిపై దాడి చేసి చంపారన్నారు. చిన్న చిన్న పిల్లలపై అకృత్యాలకు పాల్పడుతున్నారని జగన్ ఆవేదన చెందారు. పిఠాపురంలో ఇంటర్ అమ్మాయి అదృశ్యమైందన్నారు. హిందూపురంలో అత్తాకోడళ్లపై అత్యాచారం జరిగిందన్నారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్తుల్ని అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారన్నారు. ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు పోస్ట్ చేస్తున్నా కేసులు పెడుతున్నారన్నారు. ఎవరూ భయపడవద్దని అందరికీ తాను అండగా ఉంటానన్నారు. 


రాష్ట్రంలో గత 5 నెలల్నించి ప్రభుత్వం ప్రతి రంగాన్ని, ప్రతి విభాగాన్ని మోసం చేసిందన్నారు. అన్ని వ్యవస్థల్ని నీరుగార్చారన్నారు. అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, 108 సేవలు అన్నీ మూలనపడ్డాయన్నారు. 


Also read: Janasena vs TDP : పవన్ పై మంద కృష్ణ మాదిగ సీరియస్, మందకృష్ణ వెనుక చంద్రబాబు ఉన్నారా..?!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.