ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం (YSR Matsyakara Bharosa) నగదును ఏపీ  సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. గత ఏడాది  మే 6న మత్స్యకారులకు రెండో ఏడాది నగదు బ్యాంక్ ఖాతాలకు చేరింది. ఈ ఏడాదికి సంబంధించి ఆర్థిక సాయాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్ మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి రాష్ట్రంలోని మత్స్యకారులకు రూ.119.88 కోట్లు విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో ఏపీలోని మత్స్సకారులకు ఇచ్చే రూ.4 వేలు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారు. వరుసగా మూడో ఏడాది సైతం మత్స్యకారులకు వైఎస్సార్ మత్స్యకార భరసా నగదు విడుదల చేశారు. ఒక్కో మత్స్యకారుడికి దీని ద్వారా రూ.10,000 బ్యాంకు ఖాతాకు చేరతాయి. సముద్రంలో చేపలవేట నిషేధం ఉన్న సమయంలో జీవనోపాధి లేక మత్స్యకార కుటుంబాలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) కొనసాగిస్తున్నారు.


Also Read: COVID-19 Vaccine: భారత్‌లో కరోనాపై ఏ వ్యాక్సిన్లు ప్రభావం చూపుతాయో తెలుసా



వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద ఈ ఏడాది మొత్తం 1,19,875 కుటుంబాలకు లబ్ది చేకూరింది. ప్రతి కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.10,000 మేర ఆర్థిక చేయూత అందిస్తోంది. తొలి ఏడాది 2019లో 1,02,478 కుటుంబాలకు రూ.102.48 కోట్లు, గత ఏడాది కరోనా సమయంలోనూ 1,09,231 కుటుంబాలకు రూ.109.23 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్, మూడో ఏడాది నేడు రూ.119.88 కోట్లు లబ్ది చేకూరనుంది. మత్సకార కుటుంబానికి చెందిన వారు YSR Matsyakara Bharosa పథకం ద్వారా ఆర్థిక చేయూత పొందాలని అధికారులు పిలుపునిచ్చారు.


Also Read: EPFO Alert: కరోనాతో EPF ఖాతాదారులు మరణిస్తే, నామినీకి రూ.7 లక్షల పరిహారం


ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ. 1.50కే ఇచ్చేందుకు ఏటా రూ. 780 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. రూ. 50.3 కోట్లతో 35 చోట్ల ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబులు ఏర్పాటు చేశామని, ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు 100కు పైగా ఆక్వా హబ్ లు నిర్మిస్తున్నామన్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook