Mekapati Vikram Reddy: ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మకూరు బైపోల్ హీట్ పుట్టిస్తోంది. విజయం తమదంటే తమదేనని అధికార, విపక్షాలు అంటున్నాయి. ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ తరపు మాజీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టీడీపీ ..పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ, జనసేన మాత్రం ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపాలని భావిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈక్రమంలో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ప్రసాద్‌కు రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి బాలినేని, ఎంపీ వేమిరెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా వైసీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.


ఆత్మకూరు అభివృద్ధికి గౌతమ్‌రెడ్డి ఎంతో కృషి చేశారని చెప్పారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. ఈక్రమంలోనే విక్రమ్‌రెడ్డికి సీఎం జగన్ అవకాశం కల్పించారన్నారు. సీఎం జగన్‌ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని చెప్పారు. ఉప ఎన్నికలో పోటీకి ఎవరూ ముందుకు రావడం లేదని..విపక్ష పార్టీలు భయపడుతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. 


రాజకీయాలు తనకు కొత్త అని..ఐనా ప్రజల కోసం పనిచేస్తానన్నారు విక్రమ్‌రెడ్డి. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తన నామినేషన్‌ కార్యక్రమానికి వైసీపీ ముఖ్య నేతలంతా రావడం సంతోషంగా ఉందన్నారు. గౌతమ్‌రెడ్డి వారసుడిగా విక్రమ్‌ను ఎంపిక చేశామని మేకపాటి రాజమోహన్‌రెడ్డి వెల్లడించారు. ఆత్మకూరులో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారని గుర్తు చేశారు. 


ప్రజలంతా ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ఇటీవల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. ఈక్రమంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పటివరకు వైసీపీ ఒక్కటే అభ్యర్థిని ప్రకటించింది. మిగతా పార్టీలన్నీ ఇంకా సమాలోచనలు జరుపుతున్నాయి. ఎన్నికల పోటీ నుంచి టీడీపీ తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.


Also read:జమ్మూకశ్మీర్‌లో వరుస హత్యలు... బ్యాంక్ మేనేజర్‌ను కాల్చిచంపిన ఉగ్రవాదులు...


Also read:Sharmila Comments: ఈదరిద్రాన్ని మనమే మోయలేం..దేశానికి కావాలా..షర్మిల ఘాటు వ్యాఖ్యలు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook