Pinipe Srikanth in murder case allegations: డాక్టర్  బీఆర్అంబేడ్కర్ కోన సీమా జిల్లా  అయినవిల్లిలో రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడి హత్య కేసులో పినిపె శ్రీకాంత్ ను పోలీసులు ప్రధాన నిందితుడిగా  గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అయిన వల్లిలో వాలంటీర్ దుర్గా ప్రసాద్ ను 2022 జూన్ 6న హత్య చేయించినట్లు ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో..  చనిపోయిన వ్యక్తి స్నేహితుడు ధర్మేష్ ను పోలీసులు తమదైన స్టైల్ లో విచారిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ఈ క్రమంలో ఈ నెల 18 వరకు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించినట్లు తెలుస్తొంది. ఈ కేసులో మరో నిందితులతో పాటు.. పినిపె శ్రీకాంత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో.. దుర్గా ప్రసాద్ ధర్మేష్ కోటి పల్లి రేవ్ వద్దకు బైక్ మీద వెళ్లాడు. వెనుక కారులో కొంత మంది ఫాలో అయ్యారుు. రేవు వద్ద ఉన్న వ్యక్తి పడవలో లోపలకు వెళ్లగా.. కారులో వచ్చిన వాళ్లు ముగ్గురు దుర్గాప్రసాద్ మెడకు తాడు బిగించి హత్య చేసినట్లు ధర్మేశ్ తెలుస్తొంది.  


చనిపొయిన వ్యక్తి భార్య ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.  కొన్నాళ్ల క్రితం.. చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీ లభించడంతో పాటు, పోస్ట్ మార్టంలో హత్య చేసినట్లు నిర్దారణ అయ్యింది.


మాజీ మంత్రి స్పందన ఇదే..


దళిత యువకుడు దుర్గా ప్రసాద్ హత్యకు తన కొడుకు సంబంధంలేదని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తెల్చిచెప్పారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రోద్బలంతో తన కుమారుడిని కేసులో A1గా చేర్చారంటూ ఆగ్రహాం వ్యక్తం చేశాడు. తమకు న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.


Read more: Amrapali: చంద్రబాబు మరో సంచలనం.. ఆమ్రపాలీకి కీలక బాధ్యతలు..?..ఏపీలో కూడా జాక్ పాట్ కొట్టేసిందిగా..


చనిపోయిన వ్యక్తి తన కుమారుడికి ప్రధాన అనుచరుడని, అలాంటి వ్యక్తిని హత్య చేయించాల్సిన అవసరం ఏముందని కూడా మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉండగా.. నిన్న  పళని లో ఉండగా.. మాజీ మంత్రి తనయుడిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.