Chandrababu naidu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల ఏపీకి వెళ్లి రిపోర్టు చేసిన ఆమ్రపాలీకి కీలక బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది.
తెలంగాణ జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేసిన ఆమ్రపాలీ అనూహ్యాంగా ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. దీనివెనుక రెండు తెలుగు స్టేట్స్ లలో పెద్ద రచ్చ నడిచింది. ఆమ్రపాలీ వర్సెస్ కేంద్రం అన్న విధంగా మారిందని చెప్పుకొవచ్చు.
తెలంగాణ క్యాడెర్ లో ఉన్న ఐఏఎస్ లు, ఐపీఎస్ లు క్యాట్ ను ఆశ్రయించారు. ఆ తర్వాత హైకోర్టులో సైతం తమ పిటిషన్ విషయంలో కల్గజేసుకొవాలని స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.
కానీ క్యాట్ తో పాటు, హైకోర్టులో కూడా డీవోపీటీ ఉత్వర్వులు పాటించాలని స్పష్టమైన ఆదేశాలను హైకోర్టు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఇటీవల ఏపీకి కేటాయించిన అధికారులు వెళ్లీ సీఎస్ కు రిపోర్టు చేశారు. అయితే.. ఇప్పటి వరకు వీరికి ఎలాంటి బాధ్యతలు కేటాయించలేదు
అయితే.. డైనమిక్ ఐఏఎస్ ఆమ్రపాలీ విషయంలో మాత్రం ప్రతీరోజు జోరుగా వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఆమెకు తొలుత డిప్యూటీ సీఎం పవన్ పేషీలో కీలక పోస్ట్ ఇవ్వనున్నారని వార్తలు వచ్చాయి. దీంతో పవన్ కు మరింత పవర్ వచ్చినట్లు అని చాలా మంది భావించారు.
కానీ ఇప్పటి వరకు కూడా ఆమ్రపాలీకి ఏ బాధ్యతలు అప్పగిస్తారో క్లారీటీ రాలేదు. మరొవైపు ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం.. ఆమ్రపాలీకి ఆమెకు తగ్గ బాధ్యతల్ని అప్పగించాలని చూస్తున్నట్లు తెలుస్తొంది. ఆమ్రపాలీ అతి తక్కువ కాలంలో జీహెచ్ఎంసీకి కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి గొప్ప మార్పులు తీసుకొచ్చారు.
ఇటీవల వర్షాలు కురిసినప్పుడు.. హైదరబాద్ లో గ్రౌండ్ లేవల్ లో తిరుగుతూ, అధికారులను, అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలలో పాల్గొన్నారు. అయితే.. ఏపీలో కూడా ఆమ్రపాలీకి విశాఖకు కమిషనర్ గా లేదా తన పేషీలోనే కీలక బాధ్యతలు అప్పగించాలని కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నారంట.
అధికారులు డైనమిక్ గా ఉంటే ప్రజలకు అందాల్సిన ఫలాలు సక్రమంగా అందుతాయని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం తరచుగా చెప్తుంటారు. అందుకే ఆమ్రపాలీకి కొన్ని కీలక బాధ్యతలు అప్పగించాలనే .. ప్రస్తుతం ఆమెను పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తొంది. మరో రెండు రోజుల్లో ఆమ్రపాలీకి కీలక బాధ్యతలు అప్పగిస్తు ఏపీ సర్కారు ఉత్తర్వులు సైతం జారీ చేస్తుందని వార్తలు వస్తున్నాయి